వార్నర్, బెయిర్ స్టో సెంచరీలు : బెంగళూరు బౌలర్ల ఊచకోత

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో.. లోకల్ టీమ్ హైదరాబాద్ సన్ రైజర్స్ పరుగుల సునామీ సృష్టించింది. ఐపీఎల్ లీగ్  మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోసింది. హైదరాబాద్ టీమ్ .. బెంగళూరు జట్టుకు 232 పరుగులు అత్యంత భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది హైదరాబాద్ సన్ రైజర్స్. ఆ జట్టు ఓపెనర్లు .. మొదటినుంచే ఆర్సీబీ బౌలర్లపై పరుగుల పిడుగులు కురిపించి….. బౌండరీల బాంబులు వేశారు. బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడారు. తొలి వికెట్ కు 16.2 ఓవర్లలో ఏకంగా 185 రన్స్ రికార్డ్ భాగస్వామ్యాన్ని అందించారు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్. ఈ భాగస్వామ్యంలో 114 రన్స్ బెయిర్ స్టో చేసినవే.

ఉప్పల్ లో బెయిర్ ‘స్టార్మ్’ … క్విక్ సెంచరీ

స్ట్రైకర్ గా క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో స్టేడియంలో దుమ్ములేపాడు. 52 బాల్స్ లో సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 56 బాల్స్ లో 114 రన్స్ చేశాడు. బెయిర్ స్టో ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 203.57 రన్ రేట్ తో రన్స్ సాధించాడు బెయిర్ స్టో.

ఆర్సీబీ పై వార్ ప్రకటించిన వార్నర్

నాన్ స్ట్రైకర్ ఎండ్ లో బెయిర్ స్టో తో పాటుగా రెచ్చిపోయి ఆడాడు స్కిప్పర్ వార్నర్. ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరుకు దడ పుట్టించారు. బెయిర్ స్టో ఔట్ అయిన తర్వాత ఫుల్ లెంగ్త్ లో విశ్వరూపం చూపించిన వార్నర్.. లాస్ట్ ఓవర్లో బౌండరీతో సెంచరీ పూర్తిచేశాడు. 55 బాల్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు డేవిడ్ వార్నర్. 181.81 స్ట్రైక్ రేట్ తో సెంచరీ చేశాడు డేవిడ్. విజయ్ శంకర్ 9 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. యూసుఫ్ పఠాన్ 6 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 231 రన్స్ చేసి బెంగళూరుకు భారీ టార్గెట్ పెట్టింది హైదరాబాద్.

బెంగళూరు బౌలర్లలో ఏ ఒక్కరు పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు.

Latest Updates