వైరల్: బుట్టబొమ్మ పాటకు వార్నర్ డ్యాన్స్

భార్యతో కలసి అదిరిపోయే స్టెప్పులు

న్యూఢిల్లీ: అదిరిపోయే స్ట్రోక్ ప్లేతో క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించే ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈసారి తన డ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన సూపర్ హిట్ చిత్రం అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు వార్నర్ చిందులేయడం విశేషం. ‘ఇది టిక్ టాక్ టైమ్. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి’ అని ట్వీట్ చేసిన వార్నర్.. తన భార్య, కూతురితో కలసి డ్యాన్స్ చేసిన వీడియోను ఆ ట్వీట్ కు జత చేశాడు. ఈ సాంగ్ లో వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ అవుతోంది.

Latest Updates