సత్తా చాటేందుకు వార్నర్ రెడీ

ఐపీఎల్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌ లో పునరాగమనం చేసేందుకు రెడీ అవుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పై తనకు పూర్తి నమ్మకముందని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ చీఫ్‌ కోచ్‌ టామ్‌ మూడీ చెప్పాడు. ఈ సీజన్‌ లో సత్తా చాటేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు. ‘ వరల్డ్‌ క్లా స్‌ ప్లేయర్‌  ఎవరైనా సరే ఒక గేమ్‌ కు దూరమైతే అతను కచ్చితంగా కుంగిపోతాడు. తిరిగి టీమ్‌ లోకి వస్తున్నప్పుడు అతనిలో స్ఫూర్తి నింపాల్సి న అవసరం ఉంటుంది. కా నీ, వార్నర్‌ తో మాట్లా డుతుంటే అతనికి ఆ అవసరమే లేదనిపిస్తోంది. పరుగులు సాధించాలన్న కసి, ఆకలి అతనిలో కనిపిస్తున్నాయి. వార్నర్‌ చాలా పా జిటివ్‌ గా ఉన్నాడు. సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడ’ని మూడీ పేర్కొన్నాడు. సన్‌ రైజర్స్‌ జట్టు లోకి ఈ సీజన్‌ లో కొత్తగా వచ్చిన ప్లేయర్ల పరిచయ కా ర్యక్రమం హైదరాబాద్‌ లో బుధవారం జరిగిం ది. జానీ బెయిర్‌ స్టో , విజయ్‌ శంకర్‌ , అభిషేక్‌ శర్మ, షాబాజ్‌ నదీమ్‌ కు సహచర ఆటగాళ్లు సన్‌ రైజర్స్‌ జెర్సీలు అందజేసిటీమ్‌ లోకి ఆహ్వానిం చారు. ఈ కా ర్యక్రమంలో మా ట్లా డిన మూడీ.. కొత్త ఆటగాళ్ల చేరికతో తమ జట్టుఅన్ని విభాగాల్లో  సమతూకంగా మారిం దన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చు కొని, బాధ్యతతీసుకోగల ఆటగాళ్లు ఉండడం టీమ్‌ బలమని అన్నాడు.

సారి ట్రోఫీ గెలుస్తాం : లక్ష్మణ్

గత సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ కు గట్టి పరీక్ష ఎదురైందని టీమ్‌ మెంటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు.నాణ్యమైన ప్లేయర్లను గుర్తించి వేలంలో వారికి కొనుగోలు చేయడం గర్వం గా అనిపిస్తోందన్నాడు. ‘గత సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ అంటే ఏమిటో  అందరికీ తెలిసిం ది. లీగ్‌ మొదలవడానికి కొద్ది రోజులు ముందే ప్రీమియర్‌ బ్యాట్స్‌ మన్‌ , కెప్టెన్‌ అయిన వార్నర్‌ సే వలను మేం కోల్పోయాం . ఆ తర్వాత కొం తమంది కీలక ప్లేయర్లు గాయాలతో ఇబ్బంది పడ్డారు. ఇలాం టి క్లి ష్ట పరిస్థితుల్లో జట్టు లో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవడానికి ముందుకొచ్చారు. జట్టు ను ఫైనల్‌ కు తీసుకెళ్లారు. మా జట్టు లో క్వాలిటీ ఉంది. ఎవరికి అవకాశం వచ్చినా.. జట్టు ను గెలిపించేం దుకు కృషి చేస్తారని అనుకుంటున్నా. కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్సీ పై పూర్తి నమ్మకం ఉంది. గత కొన్ని సీజన్లలో సన్‌ రైజర్స్‌ కు ఆడిన చాలా మంది యువ క్రికెటర్లు టీమిండియాకు ఎంపికయ్యారు. సన్‌ రైజర్స్‌ టీమ్‌ ప్రతీ ఏటా తన అభిమానుల సంఖ్యను పెం చుకుంటూ పోతోం ది. ప్లేయర్లు కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఆడుతున్నారు. ఈ సీజన్‌ లో కూడా అదే జోరుకొనసాగిస్తే, మేం కచ్చితంగా టైటిల్‌ నెగ్గుతా మ’ని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు.స్పిన్‌ బలం పెరిగింది: మురళీ ధరన్‌ కొత్త ప్లేయర్ల రా కతో ఈ సీజన్‌ లో సన్‌ రైజర్స్‌ స్పి న్‌ బలం పెరిగిం దని టీమ్‌ బౌలిం గ్‌ కోచ్‌ ముత్తయ్య  మురళీధరన్‌ అభిప్రాయపడ్డాడు. ‘గత మూడేళ్లుగా మా బౌలిం గ్‌ చాలా బాగుం ది. మా టీమ్‌ లో  చాలా మంది వికెట్‌ టేకిం గ్‌ బౌలర్లు ఉన్నారు. రషీద్‌ ఖాన్‌ రూపంలో నా ణ్యమైన స్పి న్నర్‌ టీమ్‌ లో ఉన్నాడు. లెఫ్మార్మ్‌‌ స్పి న్నర్లు షాబాజ్‌ నదీమ్‌ , అభిషేక్‌ వర్మ చేరికతో మా స్పి న్‌ బలం పెరిగింది. స్పిన్‌ , పే స్‌ మధ్య సమకూతం కూడా వచ్చిం ద’ని వివరిం చాడు. ఈ కా ర్యక్రమంలో కొత్త  ప్లేయ ర్లతో పాటు డేవిడ్‌ వార్నర్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ,సందీప్‌ శర్మ, మనీశ్‌ పాం డే, యూసుఫ్‌ పఠాన్‌ , ఖలీల్‌ అహ్మద్‌ , వృద్ధిమాన్‌ సాహా పా ల్గొన్నారు.

Latest Updates