దుబ్బాక ఎన్నికల్లో పోటీచేస్తే సజీవదహనం చేస్తాం

నటి కార్తీక డ్రైవర్‌కు బెదిరింపులు

రామాయంపేట,వెలుగు: నటి కత్తి కార్తీక డ్రైవర్‌‌‌‌ ఇజాజ్‌ షరీఫ్‌‌ను గురువారం రామాయంపేట శివారులో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. కార్తీక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌‌‌‌ నుంచి దుబ్బాక బైక్‌‌‌‌పై వెళ్తుండగా ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు తనను ఆపి కార్తీక పోటీ చేస్తే సజీవ దహనం చేస్తామని బెదిరించారని, దుబ్బాక వైపు రావద్దని హెచ్చరించారని ఇజాజ్‌ షరీఫ్‌ తెలిపారు. విషయం తెలిసి కార్తీక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునగౌడ్‌‌‌‌, ఎస్సై మహేందర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

For More News..

ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదు

మీ ప్రైవసీకి భంగం కలగకుండా.. ‘దూస్రా’ నెంబర్

77 ఏళ్ల వయసులో కొత్త బిజినెస్.. ఫుల్ సక్సెస్

Latest Updates