ఫైనల్‌కు వారియర్స్‌

హైదరాబాద్‌, వెలుగులీగ్‌ దశలో దుమ్మురేపి టేబుల్‌ టాపర్‌గా నిలిచిన నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ అదే జోరుతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం వన్‌సైడెడ్‌గా జరిగిన సెమీఫైనల్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ 3–(-–1)తో చెన్నై సూపర్‌ స్టార్జ్‌ను చిత్తు చేసింది. వరుసగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో, మెన్స్‌ సింగిల్స్‌, మెన్స్‌ డబుల్స్‌లో విజయాలు సాధించింది. మిక్స్‌డ్‌లో  లీయాంగ్‌ డే–కిమ్‌హనా(వారియర్స్‌)  జోడి 15–12, 9–15, 15–14తో  సుమిత్‌రెడ్డి– జెస్సికా పహ్‌పై గెలిచింది.

మెన్స్‌ సింగిల్స్‌లో లీచెక్‌యూ 15–12, 15–12  తో టామీ సుగియార్తోపై గెలిచాడు. చెన్నై ట్రంప్‌గా ఎంచుకున్న  మెన్స్‌ డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌–బొదిన్‌ ఇసార(వారియర్స్‌) జోడి  15–13, 14–15, 15–10తో సుమిత్‌ రెడ్డి–ధృవ్‌ కపిలపై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో  చెన్నై నాకౌటైంది. బెంగళూరు రాప్టర్స్‌, పుణె 7 ఏసెస్‌ మధ్య నేడు జరిగే రెండో సెమీఫైనల్‌లో గెలిచిన టీమ్‌తో వారియర్స్‌ ఫైనల్‌లో తలపడనుంది.

Latest Updates