విడిపోయిన తర్వాత ఏడాది వరకు పాక్‌‌లో మన కరెన్సీనే

దేశం విడిపోయిన తొలి రోజుల్లో పాకిస్తాన్​కు అవసరమైన కరెన్సీని మన ఆర్బీఐనే ముద్రించి ఇచ్చింది. నోట్లపై ప్రత్యేకంగా ‘గవర్నమెంట్​ఆఫ్​ పాకిస్తాన్’ అంటూ ముద్రించేది. నోట్లపై సంతకం మాత్రం ఆర్బీఐ అధికారులదే కావడం విశేషం! ఏడాది తర్వాత పాక్​ సొంతంగా కరెన్సీ ముద్రించుకుంది. ఆగస్టు 15, 1947 నుంచి ఇండియా, పాక్​ వేర్వేరు దేశాలుగా అధికారికంగా ఏర్పడ్డాయి. దేశ విభజనతో రక్షణ, రైల్వే, సెంట్రల్​ట్రెజరీ తదితర శాఖలన్నీ రెండు ముక్కలయ్యాయి. కొత్త దేశంగా ఏర్పడిన పాక్​కు రిజర్వ్​బ్యాంక్​ను తొందరగా ఏర్పాటు చేసుకోవడం సాధ్యంకాలేదు. దీంతో రిజర్వ్​బ్యాంక్​ఆఫ్ ఇండియానే పాకిస్తాన్​ను ఆదుకుంది. దీనికోసం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్​కోసం ఆర్బీఐ రూ.1, 2, 5, 10, 100  నోట్లను నాసిక్​లోని ఇండియన్​సెక్యూరిటీ ప్రెస్​లో ముద్రించింది. ఆర్బీఐ తయారుచేసిచ్చిన ఈ నోట్లు ఏడాది పాటు చెలామణిలో ఉన్నాయి. 1948 లో సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నోట్లను ప్రింట్​చేసుకుంది. అప్పటి వరకున్న ఇండియన్​కరెన్సీ స్థానంలో కొత్త నోట్లను అమలులోకి తెచ్చింది. ఇండియా ప్రింట్​చేసిచ్చిన నోట్లను 1952 జనవరి 15న రద్దు చేసింది.

Latest Updates