ట్రాఫిక్ తిప్పలు.. ఆటోవాలాను ఫాలో అయిన సచిన్‌‌

ముంబై: క్రికెట్ అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌‌ను కొన్ని కోట్ల మంది ఫాలో అవుతుంటారు. అలాంటి సచిన్ ఓ ఆటోవాలాను ఫాలో అయ్యాడంటే నమ్మడం కష్టమే కదా? కానీ ఇది నిజం. ట్రాఫిక్‌‌లో ఇరుక్కున్న సచిన్‌‌ను హైవేకు చేర్చడానికి ఓ ఆటోవాలా సాయం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్‌‌లో పంచుకున్నాడు. సదరు వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. ‘నేను ఈ ఆటోరిక్షాను ఫాలో అవుతున్నా. రూట్ గురించి అడిగితే నన్ను ఫాలో అవ్వమన్నాడు. అలా నన్ను హైవేకు తీసుకెళ్లాడు. ఆయనో జెంటిల్మన్’ అని సచిన్ పేర్కొన్నాడు.

Latest Updates