అద్దె క‌ట్ట‌లేద‌ని తుపాకీతో ఇంటి ఓన‌ర్ కాల్పులు: వీడియో

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం అమ‌లు చేసిన లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితి ఆస్త‌వ్య‌స్తంగా మారింది. ప‌నులు లేక‌, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి చాలా మందికి ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా మారింది. దీంతో ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంటి ఓన‌ర్లు అద్దెకు ఉంటున్న వారిని ఇబ్బందిపెట్టొద్ద‌ని కోరాయి. వాయిదాల్లో రెంట్ తీసుకోవాల‌ని సూచించాయి. మాన‌వ‌తా దృక్ప‌థంతో కొంత మంది ఓన‌ర్లు త‌మ ఇళ్ల‌లో కిరాయికి ఉంటున్న‌వారి ప‌రిస్థితిని అర్థం చేసుకుని స‌ర్దుకుపోయారు. అయితే క‌ర్ణాట‌క‌లో ఓ ఇంటి ఓన‌ర్ మాత్రం ఆద్దెకు ఉంటున్న‌వాళ్లు రెంట్ క‌ట్ట‌లేద‌ని ఏకంగా తుపాకీతో కాల్పుల‌కు య‌త్నించారు. బెదిరించ‌డానికి తుపాకీ ప‌ట్టుకుని వచ్చిన‌ ఓన‌ర్.. ఆవేశంగా గాలిలోకి కాల్పులు జ‌రిపాడు. బెల్గాం జిల్లాలోని చిక్కోడి ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డున్న వాళ్లు ఫోన్‌లో వీడియో తీశారు. అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యం పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో ఆ ఇంటి ఓన‌ర్‌ను అరెస్టు చేశారు.

Latest Updates