అలాంటోళ్లు మన దగ్గర పెరిగిన్రు

తినడం, తాగడం, చదవడం మాత్రమేకాదు.. ఒంటరిగా సినిమాలు చూసేటోళ్లు ఉంటారు. అలాంటోళ్లు మన దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్రట. అయితే ఇది బిగ్ స్క్రీన్‌ లకు కాకుం డా.. గ్యాడ్జెట్‌ లకు మాత్రమే పరిమితమవుతోంది. గత మూడేళ్లలో ఓటీటీ సర్వీసుల్ని ఉపయోగించుకుంటున్నవాళ్ల శాతం బాగా పెరిగింది. కిందటి ఏడాదిలో మన దేశంలో వందలో పదిహేను మంది ఒంటరిగా స్ట్రీమింగ్‌‌ యాప్‌ లను వీక్షించారట. యూకేకి చెందిన ఆంపెరె అనాలసిస్ కంపెనీ చేపట్టిన రీసెర్చ్‌ లో ఈ విషయం వెల్లడైంది. 2019–20 సంవత్సర కాలాన్ ని మూడు భాగాలుగా విభజించి మరీ.. ఈ రీసెర్చ్‌ చేపట్టింది అంపెరె. అంతేకాదు ఫ్యామిలీతో కలిసి చూడాలనే విషయానికి ఆ వ్యూయర్స్‌‌ అంతగా ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదు.

ఇక ఈ రీసెర్చ్‌ లో తేలింది ఏంటంటే..

ఎక్కువగా స్వీడన్‌ లో మాత్రం వందకి 45 మంది సోలో వ్యూయింగ్‌‌కి ఆసక్తి చూపిస్తున్నట్లు తేలింది. డెన్మార్క్‌‌, ఆస్ట్రేలి యాలో కూడా సోలో వ్యూయర్స్‌‌ ఎక్కువగానే ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియా, పోలాండ్‌ , మన దగ్గరే తక్కువ సోలో వ్యూయర్స్‌‌ ఉన్నట్లు రీసెర్చ్‌ తేల్చింది. నెట్‌ ఫ్లిక్స్‌‌, అమెజాన్‌ ప్రైమ్‌ , హులు సర్వీసులతో పాటు డిస్నీ ఫ్లస్‌‌, పీకాక్‌‌, హెబీవో మ్యాక్స్‌‌.. హాట్‌ స్టార్‌‌, జీ5, వూట్‌, సోనిలివ్‌ లాంటి లోకల్‌ యాప్‌ ల్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ రీసెర్చ్‌ కొనసాగించడం విశేషం.

Latest Updates