భారతీయులకు క్రికెట్ ఆటకాదు..ఓ ఎమోషన్..ఇదిగో ఇలా

భారతీయులకు క్రికెట్ అంటే ఆటమాత్రమే కాదు అంతకు మించి ఎమోషన్. ముఖ్యంగా సిరీస్ లు, ఐపీఎల్ జరిగే సమయంలో దేశాలతో, జట్లతో సంబంధం లేకుండా తాము ఆరాధించే క్రికెటర్ ఆట తీరుపై ప్రత్యర్ధులు కామెంట్స్ చేస్తుంటే తట్టుకోలేరు. పెద్దవాళ్లైతే లోలోపల కుమిలిపోతుంటారు. ఇదిగో చిన్నపిల్లలైతే ఇలా గుక్కపట్టి ఏడుస్తుంటారు.

దుబాయ్ వేదికగా ఐపీఎల్ ‌‌–13వ సీజన్ కొనసాగుతుంది. మూడు సార్లు ఐపీఎల్ చాంపియన్  చెన్నైసూపర్ కింగ్స్ ఈ సీజన్ లో అంతగా ఆకట్టుకోలేకపోతుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడి కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన చెన్నైకి ప్లేఆఫ్‌ అవకాశాలు మూసుకుపోయాయి. ముఖ్యంగా ఇండియన్ మాజీ క్రికెటర్ ధోనీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఓ బుడ్డోడు చెన్నై ప్లే ఆఫ్‌ అవకాశాలు మూసుకుపోవడంతో తన ఆవేదన వెళ్లగక్కాడు.  మీకేం తెలుసు  మా బాధలు.. మీరేమో ఎక్కడో ఉంటారు.. చెన్నై ఇంటికి వెళ్లిపోయింది… నువ్వు కూడా ఇంటికి వెళ్లి పడుకోరా.. అని అంటున్నారు.  ఇంకొకడమో.. ధోని , వాట్సన్‌, బ్రావోలకు గోవిందా చెప్పే టైమ్‌ వచ్చేసిందంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకన్నయ్యా మీరు ఇలా చేశారు  అంటూ కన్నీటి పర్యంతరమయ్యాడు.

Latest Updates