హృద‌యాల‌ను హత్తుకుంటున్న ఆ జంతువుల ఆత్మీయత

అసలే చలి కాలం. చలి తీవ్రతను తట్టుకోలేక మ‌నుషులే కాదు జంతువులు కూడా చ‌లి కాచుకుంటున్నాయి. జాతివైరం మ‌ర‌చి రెండు మూగ‌ప్రాణులు పక్క‌ప‌క్క‌న కూర్చొని చ‌లి కాచుకుంటున్నాయి. కుక్క‌, పిల్లి మధ్య ఉన్న జాతి వైరం గురించి అందరికీ తెలిసిందే. కుక్కలను చూస్తే పిల్లులు భయపడి పారిపోతుంటాయి. అలాగే పిల్లి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి తరుముతాయి. అయితే ఒక కుక్క పిల్ల, పిల్లి మాత్రం ఈ జాతి వైరాన్ని మరిచాయి. రెండూ కలిసి కూర్చొని చలిమంట‌ కాచుకుంటూన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నందా జనవరి 8న దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 15 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. నెటిజనులు ఈ వీడియోకు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.

Latest Updates