వాటర్‌ ఏటీఎంలు పనిచేయట్లే

అందరికీ నీరందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్‌ ఏటీఎంలు చాలాచోట్ల పనిచేయట్లేదు. ప్రయాణికులు, స్థానికుల దాహంతీర్చడానికి ఏర్పాటు చేయగా లక్ష్యం నెరవేరకుండానే మూతపడింది . నేచర్స్‌ స్ప్రింగ్‌ ఎకోట్యాప్, జోసఫ్‌ ఎకలాజికల్‌ వాటర్‌ సొల్యూషన్స్‌ సంస్థలు సంయుక్తంగా వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేశాయి. ఏటీఎం ఏర్పాటుకు కావాల్సినస్థలాన్ని జీహెచ్‌ ఎంసీ సమకూర్చగా, తాగునీరుసరఫరా చేసే బాధ్యతను జలమండలి తీసుకుంది .వాటర్ ఏటీఎం మిషన్ లో కాయిన్‌‌ వేయగానే కిందనున్న గ్లాస్ లో నీరు పడేలా ఏర్పాటు చేశారు.రూపాయికి అరలీటర్, రెండు రూపాయలకులీటర్ నీరు, ఐదు రూ.లకు 10 లీటర్ల నీరు, పదిరూ.లకు 20 లీటర్ల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత సిటీలోని వివిధ ప్రాంతాల్లో 50కిపైగా ఈ వాటర్ ఏటీఎంలను ఏర్పాటుచేయగా, తర్వాత వాటి సంఖ్యను సుమారు వందకుపెంచారు. వివిధ చోట్ల మరిన్ని ఏర్పాటుచేయాలని సంకల్పించారు. నిర్వహణ పరమైన లోపాలు ఏర్పడటంతో వాటిని పరిష్కరించకపోవడంతో పనిచేయకుండా పోతున్నాయి.

సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు పేరిట ఈ నీటిని మొదట అందించారు. పది లీటర్ల నీరు తీసుకునే వారికోసం ఆర్ఎఫ్‌ ఐడీ కార్డులను సైతం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అది కూడా అమలు కాలేదు.ఎలాంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన మినరల్స్‌ కలిగిన నీటిని అందిస్తామని ఆరంభంలోనిర్వాహకులు ప్రకటించారు. కానీ ఇప్పుడవే వాటర్‌ ఏటీఎంలు నిరుపయోగంగా మారాయి.దాహార్తిని తీర్చుకునేందుకు వీటి దగ్గరకు వచ్చేవారికి నిరాశే ఎదురవుతుంది . మిషన్‌‌ పనిచేయకపోవడం, నీరు రాకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్నిచోట్ల యంత్రాలు పనిచేయడం లేదని, వాటినిమరమ్మతులు చేసి నీరందిస్తున్నామని స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Latest Updates