తాగునీటి గొడవలో కొడుకు మృతి.. మరణవార్త విని తల్లి గుండె ఆగింది

కడప : తాగినీటి కోసం గొడవపడ్డ ఘటనలో తల్లీకొడుకు మరణించిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాజపేటలో శుక్రవారం రాత్రి తాగునీటి కోసం రెండు కుటుంబాల సభ్యులు ఘర్షణ పడ్డారు. గొడవ కాస్త ముదరడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఘర్షణలో పబ్బర్తి బాలాజీ (39)తలపై రాఘవా అనే వ్యక్తి కర్రలతో బలంగా కొట్టాడు. దీంతో కోమాలోకి వెళ్లిన బాలాజీని…ట్రీట్ మెంట్ కోసం శుక్రవారం రాత్రి తిరుపతి స్వీమ్స్ హస్పిటల్ కి తరలిస్తుండగా మార్గ మద్యలోనే బాలాజీ మృతి చెందాడు. బాలాజీ మరణ వార్త విని ఈరోజు అతని తల్లి భాగ్యమ్మ (80) కూడా మరణించింది.

దీంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాఘవా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. బాలాజీ, రాఘవా ఇళ్లకు కలిపి మంచినీటి కుళాయికి సంబంధించిన ఓకే మోటారు ఉందని.. ఇరు కుటుంబాలు సమన్వయంతో ఒకరి తర్వాత మరొకరు బోరు వేసుకొని మంచినీరు పట్టుకొనే వారు. శుక్రవారం బాలాజీ మోటారు వేయడంతో తాను వేసుకోవాలని రాఘవా పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం పెద్దదైందని తెలిపారు స్థానికులు. చిన్న గొడవ కారణంగా తల్లీకొడుకు బలయ్యారని కన్నీరుమున్నీరయ్యారు బాలాజీ కుటుంబసభ్యులు. రాఘవాను పట్టుకుని కఠనంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

 

Latest Updates