నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్

రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నారు. ఇటు గోదావరితో పాటు… అటు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. మరోవైపు వర్షాలతో వాగుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.  నారాయణపూర్ నుంచి విడుదలైన కృష్ణా జలాలు జూరాల జలాశయానికి చేరుకున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్నా, గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద పెరిగింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి లక్షా 23వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా…. జూరాలలోకి 35వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. జూరాలకు వరద చేరటంతో.. కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లకూడదని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజీ 24 గేట్లను అధికారులు ఎత్తారు. సుందిళ్ల బ్యారేజీలోకి గోదావరి నీరు వస్తోంది. ప్రస్తుతం బ్యారేజీలో నీటిమట్టం 128 మీటర్లకు చేరింది. ములుగు జిల్లాలోని పాలెంవాగు ప్రాజెక్టు 4 గేట్లను అధికారులు ఎత్తారు.  గోదావరి, సత్యవతి గుండం, బ్రహ్మగుండం నుంచి వరద కొనసాగుతోంది.

Latest Updates