గాలితో నీళ్లు తయారైతున్నయ్​!

‘ఇగ చెన్నైని వానలే కాపాడాలె’ అని మొన్న హాలీవుడ్ నటుడు లియోనార్డో  డికాప్రియో సోషల్‌‌‌‌మీడియాలో పోస్ట్‌‌‌‌ పెట్టిండు. దాంతో  చెన్నై నీటి కరువు వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ హాట్‌‌‌‌ టాపిక్‌‌‌‌గా మారింది. కేవలం చైన్నైలనే కాదు మనదేశంలో చానా చోట్ల ఇప్పుడు కరువు వెక్కిరిస్తోంది.రుతుపవనాలు ప్రవేశించినా..చానా చోట్ల ఇప్పటికీ ఒక్క పెద్ద వాన పడలె! ప్రాజెక్టులల్ల నీళ్లు అడుగున పడ్డయ్‌‌‌‌. వెయ్యిల అడుగుల లోతు బోర్లేసినా సుక్క నీళ్లు పడ్తలేవు. గొంతు తడుపుకోవడానికి..జనాలు అరిగోసలు పడుతున్నరు.అయితే,  కొన్ని కంపెనీలు మార్కెట్‌‌‌‌లో వాటర్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌ని పసిగట్టినయ్‌‌‌‌. గాలిని నీళ్లలెక్క మార్చే వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్లు జోర్‌‌‌‌‌‌‌‌దారుగా అమ్ముతున్నయ్‌‌‌‌.

గాలితో నీళ్లను తయారు చేసుడంటే.. అంత తొందరగా నమ్మబుద్ది కాదు.  గాలితో నీళ్లు పుట్టిస్తున్నరంటే ‘‘ఏ మంత్రమేసిన్రో? ఏం మాయ చేసిన్రో?’’ అని చిత్రం అయితది. కానీ,  ‘అనుకుంటే ప్రతి మ్యాజిక్‌‌‌‌ నిజమైతది’ అని మనిషి ఎప్పటి నుంచో  నిరూపించుకుంట పోతుండు. అట్ల సైన్స్‌‌‌‌ పుట్టించిన మ్యాజిక్‌‌‌‌లల్ల  వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఒకటి! ఇది నీటి కష్టాలు తీర్చడంలో ఒక విప్లవం అని చెప్పలేం. కానీ, మనిషి కనీస నీటి అవసరాలు తీర్చడానికి పనికొస్తుందనడంలో అనుమానం లేదు.

దేశీ కంపెనీలు
మన దేశంలో పదుల సంఖ్యలో వాటర్‌ జనరేటర్‌ తయారీ కంపెనీలు ఉన్నయ్. ‘వాటర్‌ మేకర్‌ ’ కంపెనీ వాళ్లు మొదటి వాటర్‌ జనరేటర్‌ ని పదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌ లోని జలిముడి అనే ఊళ్లో పెట్టిన్రు. ఆ ప్లాంట్ నుంచి వచ్చే డిస్టిల్డ్ వాటర్​ ఆ ఊరి తాగునీటి సమస్యను తీర్చింది. తర్వాత ‘వాటర్​ మేకరే’ గుజరాత్‌ లో మరో ప్లాంట్ పెట్టింది. అట్లా ఇప్పుడు వాటర్‌ జనరేటర్‌ అమ్మకాల్లో వాటర్‌ మేకర్‌ ముందు వరసలో ఉంది. రోజుకు 120 నుంచి 25వేల లీటర్ల నీళ్లను జనరేట్‌‌‌‌‌‌‌‌ చేసే మెషిన్లను ‘వాటర్ మేకర్‌ ’ తయారు చేస్తుంది. తొందర్లో వాటర్‌ మేకర్‌ 25లీటర్ల కెపాసి టి వాటర్‌ జనరేటర్‌ ను కూడా తెచ్చే ప్లాన్‌ లో ఉంది. కొల్‌‌‌‌‌‌‌‌కతాకు చెందిన ‘ఆక్వో’ కంపెనీ కూడా వాటర్​ జనరేటర్ల​ తయారీలో ఫేమస్‌ . ‘ ఈ మెషిన్లు నీటి సుస్థిరతను పెం చుతయ్‌‌‌‌‌‌‌‌. వీటికి కేవలం గాలి
ఉంటే చాలు. ఈ ఇండిపెం డెంట్‌‌‌‌‌‌‌‌ సోర్స్‌ కి ఎలాంటి వనరులూ అక్కర్లేదు’ అని ‘ఆక్వో’ ఫౌండర్‌ నవకరా సింగ్ బగ్గా చెప్పిండు.

ఎట్లా పని చేస్తది?
ఈ వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్‌‌‌‌‌‌‌‌ కరెంట్​తోనే నడుస్తది. స్విచ్‌‌‌‌ ఆన్‌‌‌‌ చెయ్యంగనే ఇది గాలిలో  ఉండే తేమను పీల్చుకుంటది.  మెషిన్‌‌‌‌లోపల ఉండే కాయిల్‌‌‌‌ ఆ తేమను ద్రవీకరించి.. చిన్న చిన్న నీటి బొట్లులెక్క మారుస్తది. అట్లా పోగైన నీళ్లు తర్వాత దశలో ఫిల్టర్‌‌‌‌‌‌‌‌ అయితయ్‌‌‌‌. ఇంకేముంది ట్యాప్‌‌‌‌ తిప్పంగనే  క్లీన్‌‌‌‌ వాటర్‌‌‌‌ బయటకొస్తయ్‌‌‌‌. ఎండాకాలంలో ఈ జనరేటర్లు ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తయ్‌‌‌‌. వేడి 30 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే గాలిలో 80 నుంచి 90 శాతం తేమ ఉంటది.  ఈ టెక్నాలజీ 2005లోనే  మన దేశానికి వచ్చింది. కానీ,  మూడేళ్ల కింద నుంచే  ఈ వాటర్​ జనరేటర్లు మార్కెట్‌‌‌‌లో విరివిగా అందుబాటులోకి వచ్చినయ్‌‌‌‌.   ‘ఇప్పుడిప్పుడే వీటి గురించి జనాలకు తెలుస్తోంది. ఇంకా కొన్నేళ్లలో వీటి అమ్మకాలు ఆశ్చర్యపోయే రీతిలో పెరగొచ్చు’ అని వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్‌‌‌‌‌‌‌‌  కంపెనీ ‘వాటర్‌‌‌‌‌‌‌‌ మేకర్‌‌‌‌‌‌‌‌’ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మెహర్ బండార చెప్పిండు. ‘‘మేం ఈ మెషిన్‌‌‌‌ని ‘వాటర్‌‌‌‌‌‌‌‌ ఏషియా ఎగ్జిబిషన్‌‌‌‌’లో పెట్టినప్పుడు అక్కడికొచ్చినవాళ్లంతా మా చుట్టూ గుమిగూడిన్రు. మా ప్రాజెక్ట్‌‌‌‌ని నమ్మలేదు. ఇదేదో మ్యాజిక్‌‌‌‌ అనుకుని కింది నుంచి, లోపల నుంచి ఏమైనా వాటర్‌‌‌‌‌‌‌‌పైప్‌‌‌‌లు ఉన్నయేమోనని చెక్‌‌‌‌ చేసిన్రు”అని గుర్తు చేసుకుండు మెహర్‌‌‌‌‌‌‌‌.

మన హైదరాబాద్‌ లో కూడా ఒక కంపెనీ వాటర్‌ జనరేటర్లు తయారు చేస్తోంది. ‘మైత్రి ఆక్వాటెక్‌ ’ అనే కంపెనీ లక్ష వాటర్‌ జనరేటర్‌ యూనిట్లను తయారు చేసేందుకు ‘భారత్‌ ఎలక్ట్రా నిక్స్‌ ’తో ఒప్పందం చేసుకుంది. ‘ ఇప్పటి వరకు మేం తయారు చేసిన వాటర్‌ జనరేటర్లను కార్పోరేట్స్‌ కి, సైనికులకు సప్లై చేసినం. వాళ్లు ఇప్పుడు వాటిని లదాక్‌ సరిహద్దుల్లో, నౌకాదళంలో ఉపయోగించుకుంటున్నరు’ అని ‘మైత్రి ఆక్వాటెక్’ కంపెనీ ఎండీ ఎం. రామకృష్ణ చెప్పిం డు. ‘ గాలిలో ఉన్న మినరల్స్‌ అన్నింటినీ ఈ మెషిన్‌ పీల్చుకుంటది. వాతావరణంలో ఉన్న 0.1 శాతం తేమని నీళ్లలాగ మారిస్తే చాలు మనకు తాగునీటి సమస్య కంప్లీట్‌‌‌‌గా తీరిపోతది. ఫ్యూచరంతా ఈ వాటర్‌ జనరేటర్లదే!’ అని రామకృష్ణ వివరిం చిండు.

ధరతోనే సమస్య!
సీఎస్‌ ఆర్‌ ఫండ్స్‌ కిం ద చానా కంపెనీలు ఇప్పుడు స్కూళ్లు, ఆస్పత్రులు, ఇళ్లల్లో వాటర్‌ జనరేటర్లను ఇన్‌ స్టాల్‌‌‌‌ చేయిస్తున్నయ్‌ . ఆర్మీకి కూడా బహుమతిగా ఇస్తున్నయ్‌ . ఈ జనరేటర్ల నుంచి వచ్చేనీళ్లనే వాళ్లు తాగుతున్నరు. అయితే ఇవి సాధారణ ప్రజలకు చేరువ కాకపోవడానికి ముఖ్య కారణం ధరే! 25 లీటర్ల కెపాసిటీ వాటర్‌ జనరేటర్‌ ధర 45వేల నుంచి 70 వేల రూపాయల వరకు ఉంటే.. వంద లీటర్ల కెపాసిటి వాటర్‌ జనరేటర్‌ కు 2 లక్షల వరకు ఉంది. తాగడానికి, వంట చేయడానికి, స్నానం, బట్టలు ఉతకడానికి ఎటు కాదన్నా రోజూ వంద లీటర్లు అవసరమైతయ్‌. కరువు ప్రాంతంలో కనీసం వందలీటర్ల కెపాసిటీ వాటర్‌ జనరేటర్‌ రెండు లక్షలు పెట్టి కొనాల్సిందే! రెండు లక్షలు ఖర్చు పెట్టడం సామాన్యులకు సాధ్యం కాదు.

పాజిటివ్‌ ..నెగెటివ్‌
ఈ ఎయిర్‌ టు వాటర్‌ మెషిన్స్‌ తో నీళ్ల కోసం మీరు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదనేది పాజిటివ్‌ . ఇది ఇండిపెం డెంట్‌‌‌‌ సోర్స్‌ . గాలిలో 20 శాతం కంటే తక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో
ఈ మెషిన్స్‌ పని చేయవు. ఇది నెగెటివ్‌ !

గాలి కాలుష్యం ప్రాబ్లమేనా?
వాటర్‌ జనరేటర్ల వాడకానికి మరో ప్రధాన అడ్డంకి గాలి కాలుష్యం . దీన్ని వాడుతున్న చోట గాలిలో కాలుష్య కారకాలు ఉంటే.. నీళ్లు కూడా కలుషితమైతయ్‌ . కానీ, ఈ వాటర్‌ జనరేటర్‌ కంపెనీలు మాత్రం ఆ డౌట్‌‌‌‌ అక్కర్లే దని చెప్తున్నయ్‌ . ‘గాలిలో నుంచి నీటి బొట్లని సేకరించి న తర్వాత.. ఆ నీళ్లు సెడ్‌‌‌‌మెంట్‌‌‌‌, ప్రీ కార్బన్‌ , పోస్ట్ కార్బన్‌ , రీ మినరలైజేషన్‌ , యూవీ ఫిల్టరేషన్‌ అని
ఐదు దశల్లో ఫిల్టర్‌ అయితయ్‌ . దాంతో కాలుష్య కారకాలు నీటి నుంచి వేరైతయ్‌ ’ అని ‘వాటర్​ మేకర్’ ఫౌండర్​ మెహర్​ చెప్పిం డు. ఈ వాటర్‌ తో ఫుడ్‌‌‌‌ వండినా, టీ పెట్టినా మాములు నీళ్ల కంటే మంచి టేస్ట్‌‌‌‌ వస్తుందని వాడినవాళ్లు రివ్యూలు రాస్తున్నరు.

ఎండాకాలం వచ్చుడుతోనే చైన్నైల నీళ్ల కష్టా లు షురూ అయితయ్‌ . తాగడానికి నీళ్లు దొరకయ్‌ కొన్ని చోట్ల! చెన్నైకి చెందిన ఎస్‌ రుద్రప్రకాశ్‌ ఆ కష్టా ల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న టైంలో ‘ఎయిర్‌‌‌‌‌‌‌‌ టు వాటర్‌‌‌‌‌‌‌‌’ మెషిన్‌ గురించి తెలిసింది. వెంటనే దాన్ని కొనుక్ కొచ్చిండు. రెండేళ్ల కింద కొన్న వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికీ దాహం తీరుస్తోంది. అప్పుడు నాకు ‘డిపెండబుల్‌ వాటర్‌‌‌‌‌‌‌‌ సోర్స్‌ ’ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే వేల ఫీట్లలోతు వేసిన బోర్లు కూడా ఎండిపోయినయ్‌ . వచ్చే ఆ కొన్ని నీళ్ల క్ వాలిటీ కూడా తగ్గిపోయిం ది. ఇప్పుడు మా దగ్గర 120 లీటర్ల వాటర్ జనరేటర్‌‌‌‌‌‌‌‌ ఉంది. అంటే ఇది 24 గంటల్లో 120 లీటర్ల నీళ్లను జనరేట్ చే స్తది’ అని రుద్రప్రకాశ్‌ చెప్పిండు. చెన్నైలో ‘ వేల్‌ కన్నీ సెకండరీ స్కూల్‌ ’ అనే పేరుతో ఓ స్కూల్‌ నడుపుతోం ది మా నస పి ళ్లై. ‘ఒక విద్యావేత్తగా స్టూ డెంట్స్‌ కి తాగునీటిని అందిం చడం నా బాధ్యత. కరువు కాలంలో నీటి సమస్యకు ఈ టెక్నాలజీ ఓ పరిష్కారం అని నమ్మినం. వాటర్‌‌‌‌‌‌‌‌ జనరేటర్‌‌‌‌‌‌‌‌ని ఇన్‌ స్టాల్‌ చేసి నం. హ్యాపీగా ఉన్నం ’ అని మా నస పి ళ్లై చెప్పింది.

Latest Updates