పేరుకే పెద్దాసుపత్రులు..తాగేందుకు నీళ్లు లేవ్

ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ దవాఖానాల్లో రోగులు, వారిబంధువులు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. తాగనీకి నీళ్లు లేక బాటిళ్లుపట్టు కుని లోపలికి, బయటకు చక్కర్లు కొడుతున్నారు. ఎక్కడావాటర్‌ కూలర్లు పెట్టకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడంతోస్వచ్ఛంద సంస్థల దయతో నీటిని పట్టుకుని తాగాల్సి వస్తోంది.మరికొం తమంది హాస్పిటల్స్‌‌ ఆవరణలో ఉన్న షాపుల్లో డబ్బులు పెట్టిబాటిల్స్‌‌ కొనుక్కొంటున్నారు.

నగరంలోని  పెద్దాస్పత్రుల్లోని నీటి కష్టాలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. మండుటెండలో గుక్కెడు నీటి కోసం పేషెంట్లు , వారి బంధువులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు .గొంతు తడుపుకోవాలంటే తాగునీరు దొరకని పరిస్థితి. గాంధీ, నిలోఫర్ హాస్పి టల్స్ లోని రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . ఉస్మానియా వంటి హాస్పిటల్ లోనూ స్వచ్ఛంద సంస్థలే గొంతు తడుపుతున్నాయి. మెరుగైన వైద్యం సంగతేమో గానీ తాగేందుకు నీళ్లు ఇప్పించండి బాబోయ్ అంటూ పేషెంట్లు , వారి బంధువులు వేడుకుంటున్నారు . బాటిల్ వాటర్ కోసం హాస్పిటల్ మొత్తం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇతరప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు నీళ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నారు .

రాష్ట్రం లోనే అతి పెద్ద గవర్నమెంట్ హాస్పి టల్ ఉస్మానియా.ఇక్కడికి రోజూ 3 వేల మంది వరకు ఓపీ కోసమేవస్తుంటారు. వెయ్యి మందికి పైగా ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ఇక పేషెంట్ల అటెండెన్స్, డాక్టర్లు, ఇతర సిబ్బం దితో కలిపి దాదాపు10వేల మంది వరకు ఉంటారు. సాధారణ రోజుల్లోనీటికి పెద్దగా ఉండదు. కానీ ప్రస్తుతం దాహంతీర్చుకునేందు పేషెంట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు . ఓపీకి వచ్చే వారి కోసం ఓ స్వచ్ఛందసంస్థ నీటిని అందిస్తోంది. అయితే ఓపీ బిల్డింగ్ మొత్తానికి ఈ సంస్థ అందించే నీళ్లే దిక్కయ్యాయి.ఈ భవనంలో ఒక వాటర్ కూలర్ ను ఏర్పాటు చేసినప్పటికీ అది పనిచేయటం లేదు. ట్రీట్ మెంట్తీసుకుంటున్న వారంతా స్వచ్ఛంద సంస్థ వారు అందించే నీటి మీదే ఆధారపడుతున్నారు . శుక్రవారం సెలవు దినం కావడంతో స్వచ్ఛంద సంస్థవారు మధ్యాహ్నం నీరు సరఫరా చేయలేదు.దీంతో ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్నవారంతా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు . కులీకుతుబ్ షా భవనం వద్ద ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రమే దిక్కయ్యింది. ఇకపాత భవనంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రెండు వాటర్ కూలర్ల ద్వారా పేషెంట్లకు, వారి అటెండెం ట్స్ కు నీటినిసరఫరా చేస్తున్నారు . దీంతో పేషెంట్లు , వారి సహాయకలు 300 మీటర్లు నడవాల్సి వస్తోంది. హాస్పిటల్ లో విభాగాల వారీగా ఫ్రిజ్ లు అందుబాటులోఉంచాలని పేషెంట్లు కోరుతున్నారు. నీటి కష్టాలు లేకుండా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి నీటిని అందిస్తున్నామని సూపరింటెండెం ట్ డాక్టర్నాగేందర్ తెలిపారు. ఎండలు పెరిగే అవకాశంఉందని, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు .

నిలోఫర్ లో నీటి దందా

నిలోఫర్ హాస్పి టల్ వద్దకు వెళ్తే చాలు జనంవాటర్ బాటిల్స్ తో నీటి కోసం వెతుకుతున్నదృశ్యాలు కంట పడతాయి. రోజులో1200మందికి పైగా ఓపీ కోసం వస్తుండగా మరోవెయ్యి మంది ఇన్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతుంటారు. వీరితో పాటు వచ్చే అటెండెన్స్, హాస్పిటల్ సిబ్బందితో కలుపుకుంటే  5 వేలమందికి ఇక్కడ తాగునీరు అవసరం. సాధారణ రోజుల్లోనే నీలోఫర్ లో నీటి కష్టాలుంటాయి.వేసవి రావటంతో గుక్కెడు నీళ్ల కోసం పేషెంట్లబంధవులు పోటీ పడుతున్నారు . కొత్త భవనంలోని అయిదో ఫ్లోర్ లో నీటి సదుపాయం లేదు.తాగే నీళ్లు కావాలనుకుంటే కొత్త భవంతి పక్కన ఉన్న నీటి ట్యాంకరే దిక్కు. ఇది ఏ మాత్రం చాలకపోవటంతో రోగులు, వారి బంధువులు బయటహోటళ్లు, దుకాణాల్లో నీటిని కొంటున్నారు . ఆస్పత్రి ఆవరణలోనే వేలాది రూపాయల నీటి దందానడుస్తోంది. హాస్పిటల్ బయట స్వచ్ఛంద సంస్థసరఫరా చేసే నీటి కోసం రోగుల బంధవులు బారులు తీరుతున్నారు . సిబ్బంది కూడా బయటేకొంటు న్నామని చెబు తున్నారు. మొదటి అంతస్తుకోసం రెండు వాటర్ కూలర్లు తెచ్చినప్పటికీ వాటిని అలంకార ప్రాయంగానే ఉంచారు. ఓపీ వద్ద ఉన్నఆర్వో ప్లాంట్ ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు.దీనికితోడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి సరైననీటి వసతి లేదని పేషెంట్లు వారి బంధువులు వాపోతున్నారు . వాటర్ సమస్య పై దృష్టి పెట్టామని మరో వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ తోపాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా మరింత నీటిని సరఫరాచేసేలా చర్యలు తీసుకుంటామని హాస్పి టల్ సూపరిండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

గాంధీ లోనూ ఇదే సీన్

గాంధీ హాస్పి టల్ లో నీటి కష్టాలు పేషెంట్ల కుచుక్కలు చూపిస్తున్నాయి. ఇన్ పేషెంట్లకు చికిత్సఅందించే 8 అంతస్తుల భవనంలో ఎక్కడా ఫ్రిజ్లు అందుబాటులో లేవు. హాస్పి టల్ లో చికిత్సపొందుతున్న వారంతా తాగు నీరు కావాలంటే మార్చురీ పక్కన ఉన్న ట్యాంకర్ వద్దకు రావాల్సిందే. ఒక్కో ఫ్లోర్ లో కనీసం ఒక్క వాటర్ ఫ్రిజ్ కూడా అందుబాటులో లేదు. గాంధీ హాస్పి టల్లో ఓపీ విభాగంతో పాటు ఇన్ పేషెంట్లు , హాస్పిటల్ స్టాఫ్ అంతా కలిసి10 వేల మందికి పైగాఉంటారు. వీరందరికీ సరిపడినంత  తాగునీరు అందుబాటులో లేదు. హాస్పి టల్ ఆవరణలో ఉన్నస్వచ్ఛంద సంస్థలు కొంత వరకు నీటి కష్టాలను తీరుస్తున్నాయి. చాలా మంది పేషెంట్ల బంధువులునీళ్ల కోసం సమీపంలోని హోటళ్లు, ఇతర షాప్ల వద్ద కు వెళ్లి కొంటున్నారు . ఇక కాలకృత్యాలుతీర్చుకోవటానికి కావాల్సినంత నీరు లేక ఆవేదనవ్యక్తం చేస్తున్నారు .

 

Latest Updates