వాటర్ ట్యాంకర్ లో కాళ్లు కడుక్కున్న డ్రైవర్.. వీడియో వైరల్

నీటి కోసం యుద్ధాలు జరిగిన చరిత్ర మనది. ఇప్పటికీ తాగునీటి కోసం జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నగరంలో ఉన్న కోట్ల జనాభాకు నీటి తిప్పలు ఎప్పుడూ ఉండేవే. అందుకే చాలా మంది వాటర్ ట్యాంకర్ ల మీద ఆధారపడతారు. ఆ ట్యాంకర్ వాళ్లు ఏ వాటర్ తీసుకొచ్చినా.. అవే అందరికీ మంచినీళ్లు. అలా ఎంతోమంది దాహార్తిని తీర్చే ట్యాంకర్ నీటిలో కాళ్లు కడిగాడో డ్రైవర్. మూసాపేటలోని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్యాంకర్ లో వాటర్ నింపేటప్పుడు.. డ్రైవర్ విజయ్ ట్యాంకర్ పైన నిల్చొని కాళ్లు కడుకున్నాడు. ఆ నీరు కూడా ట్యాంకర్ లోకే వెళ్లింది. దాంతో ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో.. వాటర్ బోర్డు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రైవర్ విజయ్‌పై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.

ఇలాంటి సంఘటనలు జరగకుండా వాటర్ ట్యాంకర్లను ఆటోమేటిక్ గా నింపే సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేస్తున్నామని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో సరికొత్త టెక్నాలజీ ఆధారంగా ‘యాక్యుయేటర్’ పరికరం ఏర్పాటు చేయబడింది. త్వరలోనే వాటర్ బోర్డ్ పరిధిలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

For More News..

సినిమాలు లేక కిరాణ కొట్టు పెట్టుకున్న దర్శకుడు

అందరికీ నార్మాల్ మాస్క్.. ఈయనకు మాత్రం గోల్డ్ మాస్క్

ఆన్​లైన్ క్లాసులతో ఫాయిదా లేదు

Latest Updates