బైక్ ను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్: మహిళ మృతి

హైదరాబాద్ గుడిమల్కాపూర్ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. వాటర్ ట్యాంకర్ బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జానకి అనే మహిళ మృతి చెందింది. జానకి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తోంది. ఉదయం ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates