వాటర్ విలేజ్.. ఆ ఊరు నీటి పైన ఉంది

water-village-in-brunei

water-village-in-bruneiఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ ఫొటోల్లో కనిపించే ఊరికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. షాపింగ్‌ చేయాలన్నా.. సినిమాకు వెళ్లాలన్నా.. ఆటలు ఆడుకోవాలన్నా.. అంతా నీటిపైనే. అవునా, ఇలాంటి విలేజ్‌ ఎక్కడ ఉందంటారా? బ్రూనైలో ఉంది. బోర్నియా ద్వీపకల్పంలో ఒక చిన్న ప్రాంతం బ్రూనే. దేశ జనాభా లక్షల్లో మాత్రమే. రోజులు కాదు.. సంవత్సరాలు కాదు.. జీవితాంతం నీటిపైనే జీవితాలు కొనసాగిస్తున్నారు. అక్కడ ఇళ్లన్నీ నీటిపైనే ఉంటాయి. అందుకే వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలేజ్‌ అని పేరొచ్చింది. ఇక్కడ ఇళ్లన్నీ చెక్కతో తయారై ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా నీటిపైనే జీవిస్తున్నారు ఇక్కడివాళ్లు. ప్రభుత్వం కూడా వీళ్లకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు ప్రపంచ నలుదిక్కుల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

water-village-in-brunei

Latest Updates