వయనాడ్ గిరిజనులు: రామాయణం..నిత్యపారాయణం

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తుండడంతో రామాయణం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సీతారాముల అరణ్యవాసం చేసింది. ఇక్కడేనని వయనాడ్ లోనే అని స్థానిక గిరిజనుల నమ్మకం. దీంతో అందరి చూపు ఇప్పుడు వయనాడ్​పై పడింది. చదువు సంధ్యలు లేకపోవడంతో రామాయణాన్ని స్థానిక భాషల్లో కంఠస్థం చేసుకొని తరతరాలుగా తమ వారసులకు అందిస్తూ వస్తున్నారు. వాయనాడ్ మొత్తం జనాభాలో ఎకంగా 18 శాతం ఉన్న గిరిజనుల్లో 12 తెగలున్నాయి. 40 నుం చి 50 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గిరిజన తెగలు రామాయణాన్ని కంఠస్థం చేశాయి. ఒక్కో తెగ ఒక్కో వ్యాఖ్యానాన్నిరామాయణానికి జోడించడం విశేషం. ప్రకృతి ఒడిలో జీవించే ఈ తెగలు తమ జీవనవిధానాన్నిరామాయణంలో జొప్పిస్తూ సరికొత్త వ్యాఖ్యానాలు రూపొందించాయి. ఒక్కో తెగకు ఒక్కో వ్యాఖ్యానం ఉండడంతో రామాయణంలోని సుమారు 30 ఘట్టాలు తమ ప్రాంతంలోనే జరిగినట్లు గిరిజనులు బలంగా నమ్ముతున్నారు. వయనాడ్ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్పల్లీ, కల్పేటలో వాల్మీకి ఆశ్రమం ఉండేదని వీరి నమ్మకం. సీతాదేవి తన రోజువారి పూజల కోసం పుల్పల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘ఇరులం’లో పూలు కోసుకునేదని వీరి విశ్వాసం. ‘ ముతంగ వైల్డ్ లైఫ్ సెం చరీ’లో ఇప్పుడున్న రాం పల్లి గ్రామం దగ్గర అశ్వమేధయాగం కోసం అయోధ్యలో శ్రీరాముడు వదిలిన అశ్వాన్ని లవకుశులు ఇక్కడ అడ్డుకున్నారని చెబుతారు. ఇక్కడి అతి పెద్ద కొండను ‘బానాగురగుట్ట’గా గిరిజనులు పిలుస్తారు. ఇలా రామాయణంలోని 30 ఘట్టాలు తమ జిల్లాలోనే జరిగాయని నమ్మే గిరిజనులు ఈ ముప్పై చోట్ల గుళ్లు కట్టి తరతరాలుగా పూజలు చేస్తున్నారు.

Latest Updates