విదేశీ విద్యకు మార్గాలు…

ways-for-foreign-education

ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఎలిజిబిలిటీ టెస్టులున్నా ప్రధానంగా చెప్పుకునేవి పదిలోపే. అవి టోఫెల్​, ఐఈఎల్​టీఎస్​, జీఆర్​ఈ, శాట్​, జీమ్యాట్​, పీటీఈ, ఏసీటీ. ఇందులో కొన్ని ఇంగ్లిష్​ ఫ్లూయెన్సీ టెస్టులు కాగా మరికొన్ని యాప్టిట్యూడ్​ పరీక్షలు. దాదాపు అన్ని టెస్టులను అమెరికాకు చెందిన ఇన్​స్టిట్యూషన్లు నిర్వహిస్తుండగా కొన్ని బ్రిటిష్ కౌన్సిల్​, ఆస్ర్టేలియాలు జరుపుతాయి. అన్ని పరీక్షల్లో ఇంగ్లిష్​ లాంగ్వేజ్​పై అభ్యర్థికున్న అవగాహనను ప్రధానంగా టెస్ట్​ చేస్తారు. ఇందుకుగాను బిగ్గరగా చదవడం, సినిమాలు, రేడియోల్లోని సంభాషణలు వినడం, ఇతరులతో డిస్కస్​ చేయడం, మాట్లాడటం, నచ్చిన అంశాలను పదే పదే రాయడం వంటి వాటి ద్వారా ఇంగ్లిష్​ స్కిల్స్​ పెంచుకోవచ్చు. అలాగే రీజనింగ్​ అండ్​ క్వాంటిటేటివ్​ ఎబిలిటీని కూడా పరీక్షిస్తారు కాబట్టి ఆయా పరీక్షల్లో అడిగే మోడల్స్​ ను బాగా ప్రాక్టీస్​ చేయాలి.

జీఆర్‌‌ఈ

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్‌‌ (GRE).. విదేశీ యూనివర్శిటీలు, ఇన్‌‌స్టిట్యూట్‌‌లలో ఇంజినీరింగ్, సైన్స్, ఎంబీఏ, ఎంఎస్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ఫెలోషిప్‌‌లు, పీహెచ్‌‌డీలో అడ్మిషన్లకు రాయాల్సిన పరీక్ష. 130కి పైగా దేశాల్లో దాదాపు నాలుగు వేల ఇన్​స్టిట్యూషన్లు ఈ స్కోర్​ను ఆమోదిస్తాయి. 10+2+4 విధానంలో చదివినవారు అర్హులు. ఆన్‌‌లైన్, ఈ-మెయిల్ లేదా ఫోన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు 205 డాలర్లు. ఐదేళ్ల వరకు వ్యాలిడిటీ ఉండే జీఆర్​ఈను ప్రతి పరీక్షకు నెలరోజుల వ్యవధితో సంవత్సరానికి అయిదుసార్లు రాయవచ్చు. ఇందులో 600 మార్కులు తెచ్చుకోగలిగితే టాప్​ వర్శిటీల్లో అడ్మిషన్ ఖాయం.

పరీక్షా విధానం

ఆన్‌‌లైన్ లేదా పెన్​ అండ్​ పేపర్ బేస్డ్​ పరీక్ష ఇది. సమయం 3 గంటల 45 నిమిషాలు. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ స్కిల్స్,  క్వాంటిటేటివ్ స్కిల్స్, ఎక్స్​పరిమెంటల్ సెక్షన్‌‌ల నుంచి క్రిటికల్​ థింకింగ్​ అనలిటికల్​ రైటింగ్​ ను పరీక్షించేలా ప్రశ్నిలిస్తారు. దీంతో పాటు లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కెమిస్ట్రీ వంటి ఏడు రకలా సబ్జెక్టు టెస్టులు రాయాల్సి ఉంటుంది.

వెబ్‌‌సైట్: www.ets.org/gre

టోఫెల్

ఇంగ్లిష్​ మాట్లాడని దేశాల విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలంటే రాయాల్సిన పరీక్ష ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్‌‌ (TOEFL). అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థి ఇంగ్లిష్​ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. దాదాపు 135 దేశాలు 10 వేలకు పైగా విశ్వవిద్యాలయాలు, ఇన్​స్టిట్యూషన్లు టోఫెల్​ స్కోర్​ను ఆమోదిస్తున్నాయి. సంవత్సరం మొత్తం 50కి పైగా స్లాట్​లలో నిర్వహించే టోఫెల్​ కు ఆన్‌‌లైన్, ఈ-మెయిల్ లేదా ఫోన్​ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు 170 అమెరికా డాలర్లుగా ఉంది. అటెంప్ట్స్​పై పరిమితి లేదు. రాసిన ప్రతిసారి ఫీజు చెల్లించాల్సిందే.

పరీక్షా విధానం

టోఫెల్​ టెస్ట్​ డ్యురేషన్​ నాలుగు గంటలు. రీడింగ్​, స్పీకింగ్​, లిజనింగ్​ అండ్​ రైటింగ్ అనే నాలుగు విభాగాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష 120 పాయింట్లకు ఉంటుంది. గరిష్టంగా 80 పాయింట్లు పొందితే టాప్​ ఇన్​స్టిట్యూట్లలో అడ్మిషన్ లభిస్తుందని చెప్పవచ్చు. ఈ స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.

రీడింగ్​: ఇందులో స్టూడెంట్​ అండర్​స్టాండింగ్​ కెపబిలిటీ, కాన్సన్​ట్రేషన్​ వంటివి పరీక్షిస్తారు. 60 నుంచి 80 నిమిషాల పాటు నిర్వహించే రీడింగ్​లో 3 నుంచి 4 ప్యాసేజ్‌‌లు ఇచ్చి ప్రశ్నలడుగుతారు.

లిజనింగ్​: గంట నుంచి గంటన్నర పాటు నిర్వహించే లిజనింగ్​ టెస్ట్​ ఉద్దేశం అభ్యర్థి ఇంగ్లిష్​ ను విని ఏమాత్రం అర్థం చేసుకుంటున్నాడో పరీక్షించడమే. ఇందులో 50 దాకా ప్రశ్నలిస్తారు. సులువుగా అర్థమయ్యే భాషలోనే స్పీచెస్​, కన్వర్​జేషన్స్​ విని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

స్పీకింగ్: అతి తక్కువగా 20 నిమిషాల పాటు ఉండే ఈ టెస్టులో అభ్యర్థి విని, చదివిన అంశాలపై మాట్లాడాలి. ఇంగ్లిష్​ స్పీకింగ్​ స్కిల్​ చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. హెడ్​సెట్​, మైక్రోఫోన్​ల ద్వారానే మాట్లాడాలి.

రైటింగ్:  ఇందులో ఏదైనా ఒక అంశాన్ని చదివి రాయడం, మరో అంశంపై సొంతంగా అభిప్రా యాలు చెబుతూ రాయడం అనే రెండు టాస్క్‌‌ లుంటాయి. అభ్యర్థి ఆలోచనలను అంచనా వేసేదే ఈ టెస్టు. దాదాపు గంటపాటు నిర్వహిస్తారు.

వెబ్‌‌సైట్: www.ets.org/toefl

శాట్

విదేశాల్లో బ్యాచిలర్​ డిగ్రీ, ఇతర అండర్ ​గ్రాడ్యుయేట్​ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష స్కాలాస్టిట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT). దీనిని అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సంవత్సరానికి ఆరుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు ఇంటర్​/10+2 ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. ఏటా రెండు సార్లు మాత్రమే రాయాలి. స్కోర్​ ఐదేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. దీని ఆధారంగా కొన్ని వర్శిటీలు స్కాలర్​షిప్​లు, ఫెలోషిప్​లు కూడా అందిస్తున్నాయి. స్పెషలైజేషన్​ చయాలనుకునేవారు సంబంధిత శాట్​ సబ్జెక్టు టెస్టులు రాయాలి.

పరీక్షా విధానం

ఆన్​లైన్​లో నిర్వహించే శాట్​లో రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలిస్తారు. సమయం 3 గంటల 45 నిమిషాలు. ప్రతి సెక్షన్​ లో 200–800 స్కోర్​ ఉంటుంది. రెండు వేలకు పైగా స్కోరు సాధిస్తే మంచి ఇన్​స్టిట్యూట్లలో అడ్మిషన్​ పొందవచ్చు.

వెబ్‌‌సైట్: www.sat.collegeboard. org

ఐఈఎల్‌‌టీఎస్

ఆస్ర్టేలియా, బ్రిటిష్​, కెనడా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తో పాటు 140 దేశాల్లోని ఇన్​స్టిట్యూట్​లలో ప్రవేశాలతో పాటు విదేశాల్లో ఉద్యోగం, ఇతర ట్రైనింగ్​లకు వెళ్లేవారు రాయాల్సిన పరీక్ష ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్‌‌ (IELTS). దీనిని బ్రిటిష్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ కౌన్సిల్ – ఐడీపీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో రెండు రకాలున్నాయి. స్టడీస్​ కోసం రాసేది అకడమిక్​ ఐఈఎల్‌‌టీఎస్ అయితే ఉద్యోగార్థులు, ఇతరులు రాయవలసింది జనరల్ ఐఈఎల్‌‌టీఎస్. నెలకు నాలుగు సార్ల చొప్పున సంవత్సరానికి 48 సార్లు నిర్వహించే ఈ పరీక్ష స్కోర్​ రెండేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. ఎన్నిసార్లయినా రాయవచ్చు. ఫీజు దాదాపు రూ.12 వేలుగా ఉంటుంది.

పరీక్షా విధానం

ఐఈఎల్‌‌టీఎస్ పెన్​ అండ్​ పేపర్​ బేస్డ్​ టెస్ట్. పెన్సిల్​తో కూడా రాయవచ్చు. టోఫెల్​ మాదిరిగా దీనిలోనూ  రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనే నాలుగు విభాగాల్లో రెండు గంటల 45 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఇందులో లిజనింగ్​ 30 నిమిషాలు, రీడింగ్ 60,  రైటింగ్ 60, స్పీకింగ్ 15 నిమిషాల పాటు ఉంటుంది. స్కోర్​ బ్యాండ్​ 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది. 6.5 కంటే ఎక్కువ వస్తే టాప్​ ఇన్​స్టిట్యూట్​లలో అడ్మిషన్​ ఆశించవచ్చు.

వెబ్​సైట్​: www.ielts.org, www.ieltsidpindia.com

జీమ్యాట్

ఎంబీఏ, ఇతర ఫైనాన్స్​ రిలేటెడ్​ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GMAT). దీనిని అమెరికాకు చెందిన గ్రాడ్యుయేట్​ మేనేజ్​మెంట్​ అడ్మిషన్​ కౌన్సిల్​ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల ఇన్​స్టిట్యూట్​లు ఈ స్కోర్​ను ఆమోదిస్తున్నాయి. మూడేళ్ల వ్యాలిడిటీ ఉండే జీమ్యాట్​ పరీక్షను సంవత్సరానికి 5 సార్లు రాయవచ్చు. ఫీజు 250 యూఎస్​ డాలర్లు. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలున్నాయి.

పరీక్ష విధానం

ఇది ఆన్​లైన్​ పరీక్ష. అనలిటికల్ రైటింగ్ అసెస్‌‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్​ అండ్​ వెర్బల్ ఎబిలిటీ అనే నాలుగు విభాగాల్లో 800 పాయింట్లకు ప్రశ్నలిస్తారు. సమయం మూడున్నర గంటలు. ఇందులో కనీసం 600 మార్కులు వస్తే టాప్​ వర్శిటీల్లో సీటు ఆశించవచ్చు.

వెబ్‌‌సైట్: www.mba.com/india

పీటీఈ

పీటీఈ అంటే పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్‌‌. విదేశీ వర్శిటీలు, ఇన్​స్టిట్యూషన్లలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన పరీక్ష ఇది. దీనిని యూఎస్​, యూకేలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి ఇన్​స్టిట్యూషన్లు ఆమోదిస్తున్నాయి. 50 కి పైగా దేశాల్లో 2 వందల టెస్టు సెంటర్లున్నాయి. ఫీజు దాదాపు 13 వేలు.

పరీక్షా విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన పీటీఈ లో స్పీకింగ్‌‌, రైటింగ్‌‌, రీడింగ్‌‌, లిజ‌‌నింగ్ అంశాల‌‌ నుంచి ప్రశ్నలడుగుతారు. సమయం 3 గంటలు. 10 నుంచి 90 పాయింట్లకు నిర్వహించే పీటీఈలో 58 కి పైగా స్కోర్​ సాధిస్తే మంచిది.

వెబ్‌‌సైట్‌‌: http://pearsonpte.com

ఏసీటీ

అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్​ పొందాలంటే రాయాల్సిన పరీక్ష అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ACT). శాట్​ తో పాటు యూఎస్​లోని పలు వర్శిటీలు యాక్ట్ టెస్ట్‌‌ను ఆమోదిస్తున్నాయి. ఇంటర్​/10+2 ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. సంవత్సరానికి ఆరుసార్లు నిర్వహించే ఈ పరీక్ష స్కోర్​ వ్యాలిడిటీ ఐదేళ్లు. ఫీజు 48 డాలర్లు.

పరీక్షా విధానం

ఇది ఆఫ్​లైన్​ పరీక్ష. ఇందులో ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు (45 ని.), మ్యాథ్స్‌‌లో 60 ప్రశ్నలు (60 ని.), సైన్స్​లో 40 ప్రశ్నలు (35 ని.), రీడింగ్ నుంచి 40 ప్రశ్నలు (35 ని.) ఇస్తారు. ఆప్షనల్​ రైటింగ్​ టెస్ట్​ 40 నిమిషాలు ఉంటుంది. మొత్తం సమయం 3 గంటల 35 నిమిషాలు.

వెబ్‌‌సైట్: www.act.org

Latest Updates