మేం కూడా సర్జికల్ స్ట్రైక్స్​ చేశాం: కాంగ్రెస్

సర్జికల్ స్ట్రైక్స్ ను తామే కనుక్కున్నట్లు బీజేపీ సర్కారు గొప్పలకు పోతోందని కాంగ్రెస్​ విమర్శించింది. యూపీఏ పాలనలోనూ సర్జికల్ స్ట్రైక్స్​జరిగాయని చెప్పింది. పదేళ్ల పాలనలో ఆరుసార్లు ఆర్మీ దాడులు జరిపిందని గురువారం వెల్లడించింది. ఎప్పుడు, ఎక్కడ స్ట్రైక్స్ ​చేసింది పేర్కొంటూ మీడియాకు లిస్ట్ విడుదల చేసింది. అయితే, బీజేపీ నేతలలాగా ఈ దాడుల వివరాలను బయటపెట్టి రాజకీయంగా లబ్ది పొందాలని తాము ఎన్నడూ ప్రయత్నించలేదని కాంగ్రెస్​అధికార ప్రతినిధి రాజీవ్​శుక్లా చెప్పారు. సర్జికల్​స్ట్రైక్స్​ఆర్మీకి కొత్తేమీ కాదన్నారు. యూపీఏ పాలనకు ముందు వాజ్​పేయి హయాంలోనూ రెండుసార్లు ఆర్మీ ఈ దాడులు చేసిందన్నారు.

లిస్ట్ ఇదిగో..

2008 జూన్​19న పూంచ్​లోని

       భట్టాల్​సెక్టార్ లో..

2011 ఆగస్టు 30, సెప్టెంబర్​1 వరకు శ్రద్ద సెక్టార్, నీలం రివర్​వ్యాలీ

2013 జనవరి 6 న సావన్​పాత్ర చెక్​పోస్ట్

2013 జూలై 27, 28 తేదీల్లో

       నాజాపిర్​ సెక్టార్లో..

2013 ఆగస్టు 6న నీలం వ్యాలీలో..

2013 డిసెంబర్​23న నీలం వ్యాలీలో..

అంతా అబద్ధమే: బీజేపీ

యూపీఏ పాలనలోనూ సర్జికల్​స్ట్రైక్స్​జరిగాయన్న వాదనను బీజేపీ కొట్టిపారేసింది. కాంగ్రెస్​ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్​నరసింహ రావు ఆరోపించారు.

Latest Updates