సచిన్ పైలట్ తిరిగొచ్చెయ్.. సమస్యలను పరిష్కరించుకుందాం

న్యూఢిల్లీ: కుటుంబ సమస్యలు కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమవుతాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆయన పెదవి విప్పారు. సచిన్ పైలట్ తిరిగి రావాలని, ఆయన కోసం పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సూర్జేవాలా చెప్పారు.

‘ఓ ఫ్యామిలీలో ఎవరైనా నొచ్చుకొని ఉంటే ఆ కుటుంబ సభ్యులతో కలసి వారు మాట్లాడుకొని దానికి వారు పరిష్కారం కనుక్కోవాలి. కాంగ్రెస్ నాయకత్వం, సోనియా, రాహుల్ గాంధీల తరఫున సచిన్ పైలట్‌ లేదా వేరే ఓ నేత కోసం అయినా కాంగ్రెస్ పార్టీ డోర్స్ తెరిచే ఉన్నాయని స్పష్టం చేస్తున్నా. పోస్టులు, ప్రొఫైల్స్‌లో ఉన్న నాయకులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫోరమ్‌కు తెలియజేయాలి. మేం వాటిని పరిష్కరించి, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి కృషి చేస్తాం’ అని సూర్జేవాలా పేర్కొన్నారు.

Latest Updates