అన్ని మున్సిపాలిటీలను సుందరీకరణ చేస్తున్నాం: KTR

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ లను సుందరీకరణ చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కొంత దెబ్బతిందని.. అయినా వేగంగా అభివృద్ధి చెందామన్నారు. నెల నెల మున్సిపాలిటీలకు, పంచాయతీలకు ఇచ్చే  నిధులను ఎప్పటికప్పుడు అందిస్తున్నామని తెలిపారు.

హరితహారంలో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో పోలీస్ స్టేషన్ పక్కన మొక్కలు నాటారు. ఆ తర్వాత మాట్లాడారు. సంక్షోభం సమయంలో కూడా ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రైతులకు రైతు బంధు అందించి వారికి  ఆసరాగా నిలిచిందన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ లను అందిస్తూ ప్రభుత్వం అండగా ఉందన్నారు.  బ్రాహ్మణ వెళ్ళాంలో ప్రాజెక్ట్ పనులను   త్వరలోనే  పూర్తి చేసి సీఎం కేసీఆర్  చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Latest Updates