మా ఆశలన్నీ రిషబ్ పంత్ పైనే

దుబాయ్: వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ నుంచి ఈసారి కూడా చాలా ఎక్స్ పెక్ట్​ చేస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో నేడు జరిగే మ్యాచ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 13 జర్నీ మొదలు పెట్టబోతుంది. ఈ సందర్భంగా ఢిల్లీ కోచ్ పాంటింగ్ పలు అంశాలపై మాట్లాడాడు.‘వారం రోజులుగా చూస్తున్నా పంత్ మంచి టచ్ లో ఉన్నాడు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఆశిస్తున్నా. మా జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ లో పోటీ ఎక్కువగా ఉంది. రహానెతో మా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. శ్రేయస్, శిఖర్, పృథ్వీ కూడా మంచి టచ్ లో ఉన్నారు. ఇక, మన్కడింగ్ అంశంలో అంపైర్లు కూడా దృష్టి పెట్టాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Latest Updates