మే 31 తర్వాత ఆలయాలు, మసీదులు, చర్చీలు ఓపెన్!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా దెబ్బకు రెండు నెలలుగా దేవాలయాలు, ప్రార్థన మందిరాలు కూడా మూసివేయబడ్డాయి.  రెండు నెలలుగా నిత్యవసరాలకు,ఎమర్జెన్సీ సేవలకు పలు సడలింపులిచ్చినా ఆలయాలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే మే 31 తో లాక్ డౌన్ ముగిసాక.. మూతపడ్డ ఆలయాలను  కర్ణాటకలో  తెరుస్తామన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యురప్ప . దేవాలయాలు, మసీదులు, చర్చిలు , ఇతర మత ప్రదేశాలను తిరిగి తెరవడానికి అనుమతించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతిస్తే జూన్ 1 నుంచి ఆలయాలు, మసీదులు  తెరుస్తామన్నారు.దేవాలయాల్లో ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ బుకింగ్ సేవా కార్యక్రమాలకు అనుమతిస్తామన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని భక్తులను ఆలయాల్లోకి అనుమతిస్తామన్నారు. భక్తులు సామాజిక దూరం పాటించేలా చూస్తామన్నారు.

Latest Updates