కాంగ్రెస్ తోనే ఉంటామని రాహుల్ కి మాటిచ్చాం : దేవెగౌడ

we-are-with-congress-gowda

తాము కాంగ్రెస్ తోనే ఉన్నామని, రాహుల్ గాంధీకి కమిట్ మెంట్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు దేవెగౌడ, కుమారస్వామి. తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్న తర్వాత మాట్లాడిన దేవేగౌడ… మే 23న ఫలితాలు వచ్చాక అంతా క్లారిటీ వస్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడబోనన్నారు. అటు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కు మద్దతిస్తామని కమిట్ మెంట్ ఇచ్చామన్నారు. కర్ణాటకలో 19 సీట్ల వరకు తాము గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు కుమారస్వామి.

.

Latest Updates