రైతులతో ప్రభుత్వం చర్చలు : మీ బోజనం మాకొద్దు.. వండుకొని తెచ్చుకున్నాం

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా 8రోజులుగా రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమంపై కేంద్రం ముగ్గురు కేంద్రమంత్రులు.., రైతులతో చర్చలు జరిపిస్తుంది. ఇవాళ మరోసారి కేంద్రమంత్రుల బృందం రైతులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్రమంత్రులు.., రైతులతో చర్చలు జరిపారు. చర్చలు సమయంలో నూతన చట్టాల వల్ల తామెంత నష్టపోతున్నామో రైతులు కేంద్రమంత్రులకు వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు చర్చలు కొనసాగే సమయంలో మధ్యాహ్న భోజన సమయంలో కేంద్రం రైతులకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. రైతులు మాత్రం ఆ భోజనాల్ని నిరాకరించారు. తాము వండుకొని తెచ్చుకున్న భోజనాన్ని తిన్నారు.  టేబుల్‌ దగ్గర తమతో పాటు తెచ్చుకున్న భోజనాన్ని తింటుండగా.. మరి కొందరు కింద కూర్చుని తిన్నారు.

ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ కేంద్రం తమకు భోజనం, అల్పాహారం ఏర్పాట్లు చేసిందని, కానీ మేం ఆ సౌకర్యాన్ని తిరస్కరించాం. తామే స్వయంగా వండుకొని తెచ్చుకొని భోజనం చేశామని అన్నారు.

 

Latest Updates