ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంగతి తెలుసుకోవచ్చు ఈజీగా

We can insurance claim easily with IRA new rules
  • జూలై నుంచి ఈ సదుపాయం
  • ఎస్‌ఎంఎస్‌, ఈ–మెయిల్‌  ద్వారా కూడా వివరాలివ్వాలి
  • బీమా కంపెనీలకు ఐఆర్ ఏ ఆదేశం

ఇన్సూరెన్స్‌‌ క్లెయిమ్స్‌‌ను ఎలా పరిశీలిస్తారో, ఎందుకు తిరస్కరిస్తారో కంపెనీలు చెప్పవు. క్లెయిమ్‌‌ను అంగీకరించడం లేదని మాత్రమే సమాచారం ఇస్తాయి. దీంతో బాధితుడికి మరింత నష్టం తప్పదు. ఈ ఏడాది జూలై నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇన్సూరెన్స్‌‌ క్లెయిమ్స్‌‌ గురించి దరఖాస్తు దారుడికి మరింత పారదర్శకంగా, వేగంగా సమాచారం ఇచ్చేందుకు ఆన్‌‌లైన్‌‌ ట్రాకింగ్‌‌ విధానాన్నితప్పనిసరిగా అందుబాటులోకి తేవాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్‌డెవెలప్‌ మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌ డీఏ) అన్ని హెల్త్‌‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌‌ కంపెనీలను ఆదేశించింది.

ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీలను డాక్యుమెం ట్ రూపంలోనే గాకుండా, ఈ–మెయిల్‌ , ఎస్‌ ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్‌‌‌‌ పద్ధతుల్లోనూ పంపాలని ఐఆర్ డీఏ నిర్దేశించింది.‘‘పాలసీదారులకు మేలు చేయడానికే ఐఆర్‌‌‌‌డీఏఈ ఆదేశాలు ఇచ్చింది. పాలసీల్లోని పదాలు, జారీ, క్లెయిమ్స్‌‌‌‌ విషయంలో కంపెనీలు, ఏజెంట్లు పార-దర్శకంగా ఉండాలని, ఉన్నది ఉన్నట్టు చెప్పాలనికోరింది. మినహాయింపులు/తీసివేతల గురించి సమాచారం లేకపోవడం, క్లెయిమ్స్ కోసం ఇవ్వాల్సిన పత్రాల గురించి , వాటిని పరిష్కరించాల్సిన గడువు తేదీని, తిరస్కరణలకు గల కారణాలను చెప్పకపోవడం వంటి సమస్యలు ఈ కొత్త ఉత్తర్వుల వల్ల పరిష్కారం అవుతాయి. క్లెయిమ్స్‌‌‌‌ సమాచారాన్నిఎప్పటికప్పుడు తెలుసుకునే సెల్ఫ్‌ సర్వీస్‌ ట్రాకింగ్‌‌‌‌ సదుపాయం లేకపోవడం కూడా ఇబ్బందే. ప్రతిస్థాయిలోనూ వివరాలు అందించేలా ఇక నుంచి బీమా కంపెనీలు విధానాలను అమలు చేయాలి. క్లెయిమ్‌‌‌‌ల తిరస్కరణల గురించి సహేతుక కారణాలను కంపెనీలు, అంబుడ్స్‌‌‌‌మన్‌ వివరించడం లేదంటూ చాలా ఫిర్యాదులు రావడంతో ఐఆర్‌‌‌‌డీఏ ఈ నిర్ణయం తీసుకుం ది’’ అని టాఫీ ఇన్సూరెన్స్‌‌‌‌ సీఈఓ రోహన్‌కుమార్‌‌‌‌ అన్నారు.

తాజా సమాచారం అందుబాటులోకి…

సెల్ఫ్‌ సర్వీస్‌ ట్రాకింగ్‌‌‌‌ అందుబాటులోకి వస్తే క్లెయిమ్‌‌‌‌ ఏ స్థా యిలో ఉందని, ఎవరు పరిశీలిస్తున్నారు. తదితర వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. స్విగ్-గీలో ఫుడ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ఇచ్చినప్పుడు ట్రాకింగ్‌‌‌‌ ద్వారా డెలివరీ ఎక్కడిదాకా వచ్చిందో తెలుసుకోగలిగినట్టే.. క్లెయిమ్‌‌‌‌ గురించి కూడా తాజా సమాచారం అందుబాటులోకి వస్తుంది. అంతేగాక, ఇక నుంచి ప్రతి క్లెయిమ్‌‌‌‌కు కంపెనీలు రిఫరెన్స్‌ ‌‌‌ నంబర్‌‌‌‌ ఇచ్చి, ఆ విషయాన్ని పాలసీదారుడికి మొబైల్‌ , ఈ–మెయిల్‌ ద్వారా తెలియజేయాలి. క్లెయిమ్‌‌‌‌ సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లు , సర్వే అవసరమైనప్పుడు, క్లెయిమ్‌‌‌‌ను స్వీకరించినప్పుడు, తిరస్కరించి నప్పుడు, డబ్బు లు బదిలీ చేసిన తరువాత… ఇలా అన్ని సందర్భాల్లోనూ దరఖాస్తుదారుడికి నోటిఫికేషన్లు పంపాలి. రిఫరెన్స్‌‌‌‌ నంబర్‌‌‌‌తో వెబ్‌ సైట్‌‌‌‌, యాప్‌ , పోర్టల్‌ ద్వారా క్లెయిమ్‌‌‌‌ స్టేటస్‌ ను తెలుసుకోవచ్చు. పాలసీదారులు మొబైల్‌ నంబర్లు,ఈమెయిల్‌ ఐడీలను కచ్చితంగా తీసుకోవాలని కూడా ఐఆర్‌‌‌‌డీఏ బీమా కంపెనీలకు స్పష్టం చేసింది.బ్యాం కులు పంపినట్టే, బీమా కంపెనీలు కూడాఎస్‌ ఎంఎస్‌ లు, ఈ–మెయిల్స్ ద్వారా సమాచారంఇస్తాయని సెక్యూర్‌‌‌‌నౌడాట్‌‌‌‌కామ్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌ కపిల్‌మెహతా అన్నారు. ప్రస్తుత విధానంలో క్లెయిమ్‌‌‌‌ చివ-రిదశకు వచ్చేదాకా కంపెనీలు సమాచారం ఇవ్వడంలేదని, ఇక నుంచి ప్రతిస్థా యిలోనూ వివరాలుఅందిం చడం తప్పనిసరని వివరించారు. ఒకవేళమొబైల్‌ నంబరు, ఈ–మెయిల్‌ ఐడీ ఇవ్వొద్దనుకుం టేఆ విషయాన్ని కంపెనీకి తెలియజేయాలి.

13 శాతం పెరిగిన నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు

నా న్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పాలసీలు (జీవిత బీమాయేతర పాలసీలు) గత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం పెరిగాయి. ఇలాంటి పాలసీల ప్రీమియమ్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం విలువ రూ.1.70 లక్షల కోట్లకు చేరుకుందని ఐఆర్‌‌‌‌‌‌‌‌డీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా 34 నాన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు 2017–18సంవత్సరంలో రూ.1.51 లక్షల కోట్ల విలువైన ప్రీమియమ్స్‌‌‌‌‌‌‌‌ వసూలు చేశాయి. వీటిలో 25 కంపెనీలు జనరల్‌ ఇన్సూరర్స్‌‌‌‌‌‌‌‌కా గా, మిగతా ఏడు ప్రైవేటు కంపెనీలు,మిగిలిన రెండు ప్రభుత్వానికి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలు. ఈ 25 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల కోట్లు వసూలు చేశాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో హెల్త్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ పాలసీలు 37 శాతం పెరిగాయి.

Latest Updates