కరోనాతో దేశం అల్లాడుతుంటే సైలెంట్‌‌గా ఉండలేం

కరోనాతో దేశం అల్లాడుతుంటే సైలెంట్‌‌గా ఉండలేం

తమ జోక్యం అవసరమన్న సుప్రీం
న్యూఢిల్లీ:
కరోనా కేసులు వేగంగా పెరుగుతూ దేశం సంక్షోభంలో ఉన్న  టైంలో మౌనంగా చూస్తూ ఉండలేమని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రాల్లోని పరిస్థితులను అక్కడి హైకోర్టులు బాగా పర్యవేక్షిస్తున్నా తాము స్పందించకుండా ఉండలేమంది. వైరస్ పై దేశమంతా పోరాటం చేస్తున్న  సమయంలో సుప్రీం కోర్టు జోక్యం ఎంతో అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రాల మధ్య  జరుగుతున్న సహకారాలను సమన్వయం చేయడంలో తమ పాత్ర ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కొంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన కోర్టు.. మంగళవారం మరోసారి విచారణ  జరిపింది. కరోనా అంశాలపై హైకోర్టుల్లో ప్రస్తుతం జరుగుతున్న విచారణను  ఆపే ఉద్దేశం తమకు లేదని, రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి అంశాలపై హైకోర్టులే సరైన  నిర్ణయం తీసుకోగలవని కోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు జస్టిస్‌‌‌‌ డీవై  చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్​ స్పష్టం చేసింది. 

ఆక్సిజన్, టీకాల లభ్యతపై వివరాలివ్వండి
దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అందుకు సంబంధించి  సమస్యలను సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. కరోనాను ఎదుర్కోవడానికి కేంద్రం చేపట్టిన జాతీయ ప్రణాళికను తమకు సమర్పించాంది. ఈ నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్​ను  మంగళవారం కోర్టుకు సమర్పించింది. విచారణ చేపట్టిన కోర్టు.. కరోనా కట్టడి,  ఆక్సిజన్, మందుల పంపిణీకి చర్యలు, టీకాల లభ్యత మీద వివరాలు అందించాలంది. కరోనా వ్యాక్సిన్ల ధరలను ఏ లెక్కన నిర్ణయించారో వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 18 ఏండ్లు పైబడిన  వారికి మే 1 నుంచి వ్యాక్సిన్లు వేస్తున్నందున.. అందుకు సంబంధించి రాష్ట్రాల్లో  ఉన్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై ఏప్రిల్ 28లోగా రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. కాగా,  క‌‌‌‌రోనాపై జాతీయ ప్ర‌‌‌‌ణాళిక‌‌‌‌కు సంబంధించి 200 పేజీల అఫిడ‌‌‌‌విట్‌‌‌‌ను కోర్టుకు  కేంద్రం స‌‌‌‌మ‌‌‌‌ర్పించింది.