రెండో బిడ్డని కనలేం: ఇద్దర్ని పెంచలేమంటున్న చైనీస్

బీజింగ్: కమ్యూని స్ట్​ పార్టీ ఏలుబడిలోని చైనాలో జీవన భారం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఖర్చు లు భరించలేని స్థితిలో రెం డో బిడ్డను కనలేమని తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నా రు. దేశంలో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగేం డ్ల కిం దటే’ఒకే బిడ్డ విధానానికి’ చైనా ముగింపు పలికిం ది. పనిచేసే యువత జనాభాను పెంచి , ఆర్థికాభివృద్ధిని సాధిం చాలన్న లక్ష్యంతో ‘సెకండ్​ చైల్డ్’ పాలసీని తీసుకొచ్చింది.

రెండో బిడ్డ పోషణ కోసం ప్రభుత్వ పరంగా తాయిలాలు ప్రకటించి నప్పటికీ బర్త్​ రేటు పెరగలేదు సరికదా ఏడాదికేడాదీ తగ్గుతున్నది. చైనాలో ఒక కుటుంబం ఏడాది సంపాదిం చే మొత్తంలో మూడొంతులు ఒక్క పాపాయి పోషణకే సరిపోతుం ది. అదే అమెరికాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం సంపాదనలో ఐదోవంతు పిల్లల పోషణకు ఖర్చుపెడుతుం ది. చైనాలో అతిపెద్ద వర్గమైన మిడిల్ క్లా స్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నందు వల్ల ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తున్నా సెకండ్​ చైల్డ్​ పట్ల విముఖంగా ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్​ ప్రకారం ఆంక్షలు ఎత్తేసి నప్పటికీ బర్త్​రేటు తగ్గుతూనే వస్తు న్నది. 2017లో 17.23 మిలియన్ గా ఉన్న లైవ్​ బర్త్​లు 2018నాటికి 15.23 మిలియన్లకు పడిపోయింది . చైనాలోని 50 శాతం కుటుంబాలు రెండో బిడ్డను కనడానికి ఆసక్తి చూపడంలేదు.
పిల్లల పోషణా మజాకా!
మిలీనియం తర్వాత ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలో జీవన ప్రమాణాలు కూడా బాగా పెరిగాయి. అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ  పథకాల్లో నాణ్యత దారుణంగా పడిపోయిం ది. 2008లో గవర్నమెంట్ సరఫరా చేసిన బేబీ మిల్క్​ తాగి ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. ఆ ఘటన తర్వాత సర్కారువారి సరుకుల కొనుగోళ్లు కోలుకోలేని విధంగా పడిపోయాయి. ఉన్న ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకోడానికి ఖర్చు
ఎక్కువైనాసరే విదేశీ బ్రాండ్లవైపు చైనీస్ పేరెం ట్స్ మొగ్గుచూపారు . పాలు, ఆహారం ఇతరత్రా సరుకులన్నీ ఇంపోర్టెడ్​వే వినియోగిస్తున్నారు. ‘పాపులేషన్ బౌల్’ చైనాలో జనాభాకు సరిపడా డాక్టర్లు లేరు. దీం తో హెల్త్​ కేర్ ఖరీదైన వ్యవహారంగా మారింది. సర్కారు దవాఖానాల్లో సిబ్బం దికి లంచాలు సమర్పించుకుం టేగానీ పిల్లలకు మంచి ట్రీట్ మెం ట్ దొరకడంలేదు. రెండేం డ్ల లోపు పిల్లలకు ప్రైవేట్ మెడికల్ ఇన్సురెన్స్​ కోసమే పేరెంట్స్ ఏటా 15వేల యువాన్లు వెచ్చిస్తున్నారు. ఎంత మిడిల్ క్లా సైనా నెలకు 5వేల యువాన్లు చెల్లిస్తే గానీ పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లలో వదల్లేని పరిస్థితి.

ఇక స్కూల్ ఫీజులైతే తలకుమించి న భారంగా తయారైంది. బిడ్డల బెటర్ ఎడ్యు కేషన్ కోసం పేరెం ట్స్ అందరూ ప్రైవేటు బడుల బాట పట్టారు. చైనాలో విద్య ఇప్పుడొక పెద్ద వ్యాపా రం. పిల్లల చదవులకి ప్రాధాన్యమివ్వడం చైనీయుల బేసిక్ లక్షణాల్లో ఒకటని, కాబట్టే
మంచి స్కూల్లో చేర్పించాలనే కాంపి టీషన్ పెరిగిందని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాం గ్ కాం గ్ ప్రొఫెసర్ మన్ హోంగ్ లాయ్ చెప్పారు. రెండొ బిడ్డను కనాలనుకుంటే ఉచితంగా ప్రసవం చేయిస్తామని, బాలింతకు 1200 యువాన్ల ఆర్థిక సాయం చేస్తామని, జీతంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇస్తామనీ ఫ్రావిన్స్​కోతీరుగా పలు పథకాలు ప్రకటించి నా జనం పెద్దగా పట్టించుకోవడంలేదు. పిల్లల్ని కనాలన్న ఛాయిస్ జీవితానికి సంబంధించిన ఎంపికగా మారిం దని, ఏదో ప్రభుత్వం చెప్పిందికదాని రెం డో బిడ్డని చచ్చి నా కనలేమని పేరెంట్స్  కరాఖండిగా చెబుతున్నారు.

Latest Updates