డ్రగ్స్ కేసు: మేం సిగరెట్ కూడా కాల్చలేదు

ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ ఇంట్రాగేషన్‌‌లో పాల్గొన్న హీరోయిన్లు తమపై వస్తున్న అభియోగాలను తోసిపుచ్చారని తెలుస్తోంది. చేతితో చుట్టిన హ్యాండ్ రోల్డ్ సిగరెట్స్ గురించి తాము వాట్సాప్ చాటింగ్‌‌‌లో మాట్లాడుకున్నామని వారు చెప్పినట్లు సమాచారం. హ్యాండ్ రోల్డ్ సిగరెట్స్‌‌ను ‘డూబ్’ అనే పదంతో మెన్షన్ చేశామని.. తామెప్పుడూ సిగరెట్స్ కూడా కాల్చలేదని వారు చెప్పినట్లు ఓ ఎన్సీబీ అధికారి తెలిపారు. సుశాంత్ సింగ్‌‌కు డ్రగ్ హాబీ ఉందనే విషయం గురించి తమకు ఏమీ తెలియదని హీరోయిన్లు చెప్పారన్నారు. హీరోయిన్లు తమ ఫోన్లను స్వచ్ఛందంగా ఇచ్చేశారని, వీటితో పలు విషయాలపై క్లారిటీ వస్తుందన్నారు.

Latest Updates