ఫార్మా సిటీకి భూములు ఇవ్వబోం.. రైతుల నిరసన

యాచారం: ఫార్మా సిటీ కోసం బలవంతంగా భూసేకరణ చేయరాదని రంగారెడ్డి జిల్లా, యాచారం మండలంలోని నానక్ నగర్ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు, గ్రామస్థులు సదరు నోటీసులను తగులబెట్టారు. ఫార్మా సిటీ కోసం తమ భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

Latest Updates