టీఆర్ఎస్‌‌తో మాకు ఎలాంటి పొత్తూ లేదు

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌‌లో ఎంఐఎం పార్టీ తరఫున ఓవైసీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ 52 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజల మద్దతు ఎంఐఎం పార్టీకే ఉంది. బీజేపీ చేస్తున్న రాజకీయం సరైనది కాదు. గతంలో 44 జీహెచ్ఎంసీ స్థానాలను కైవసం చేసుకున్నాం. ఈసారి 52 చోట్ల గెలుస్తాం. టీఆర్ఎస్‌‌తో మాకు ఎలాంటి పొత్తు లేదు. ఆయా డివిజన్లలో ఎంఐఎం పార్టీ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. బీజేపీ హిందూత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ముస్లింలకు లేదా?’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.

Latest Updates