ఒక్కో జవానుకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా: చంద్రబాబు

అమరావతి: పుల్వామా ఉగ్ర దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ ఘటనలో అమరులైన జవాన్లకు సంతాపం ప్రకటించారు. వారి ప్రాణ త్యాగంతో దేశమంతా విషాదంలో మునిగిపోయిందని అన్నారు.

ఈ దుఖ సమయంలో అమర సైనికుల కుటుంబాలకు మనమంతా అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వారికి ఆయన సానుభూతి ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ఒక్కో జవానుకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.

 

Latest Updates