కిమ్ హెల్త్ కండిషన్ పై క్లారిటీ ఉంది

  • ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్న ట్రంప్

వాషింగ్టన్ : నార్త్ కొరియా ప్రెసిడెంట్ హెల్త్ కండిషన్ పై తనకు క్లారిటీ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐతే ఇప్పుడే దీని గురించి తానేమీ మాట్లాడనని కిమ్ బాగుండాలని మాత్రమే కోరుకుంటానని చెప్పారు. కొన్ని రోజులు గా కిమ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు ఆసక్తి గా మారాయి. సోమవారం వైట్ హౌజ్ లో మీడియా తో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా కిమ్ ఆరోగ్యం పై ఏదైనా సమాచారం ఉందా అన్న ప్రశ్నకు తమకు కిమ్ ఆరోగ్యం పై పూర్తి సమాచారం ఉందని చెప్పారు. కిమ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందన్న వార్తలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఐతే కిమ్ తో గానీ నార్త్ కొరియా అధికార్లతో గానీ టచ్ లో ఉన్నారా అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 11 నుంచి కిమ్ కనిపించటం లేదు. దీంతో ఆయన హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ కొరియా నెబర్ కంట్రీ సౌత్ కొరియా సైతం కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడని చెబుతోంది.
కిమ్ పేరుతో లెటర్
కిమ్ ఆరోగ్యం సరిగా లేదని పుకార్లు వస్తున్న సమయంలో సోమవారం ఆయన పేరుతో నార్త్ కొరియా ఓ లెటర్ ను విడుదల చేసింది. సౌత్ ఆఫ్రికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి విషెష్ చెబుతూ కిమ్ పేరుతో లెటర్ విడుదల చేశారు. ఇది కిమ్ స్వయంగా పంపిన లెటర్ అంటూ నార్త్ కొరియా మీడియా తెలిపింది. దీంతో నార్త్ కొరియా ప్రెసిడెంట్ హెల్దీగానే ఉన్నారని తెలుస్తోంది.

Latest Updates