కాబోయే భార్య ఫోటోలతో చాహల్ సందడి

ఇండియన్ లెగ్ స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పెళ్లి జోష్ లో ఉన్నాడు. ఇటీవలే రోక వేడుక(ఎంగేజ్ మెంట్) జరుపుకున్న చాహల్  తనకు కాబోయే భార్య ధనశ్రీ వర్మతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ప్రేమను తెలుపుతున్నాడు. అంతేగాకుండా ఫోటోలకు క్యాప్షన్లు పెడుతున్నాడు. రీసెంట్ గా తన కాబోయే భార్యతో  చిరునవ్వులు చిందిస్తూ.. చాహల్ తన చేతులతో హార్ట్ సింబల్ చూపెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేశాడు. కెమెరా, గులాబీ యొక్క ఎమోజీలతో ఈ ప్రేమను ఒక ఫోటోగ్రాఫ్ లో ఉంచుతాం, అని క్యాప్షన్ ఇచ్చాడు.

అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఈ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు జట్టు సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. భారత్ తరఫున యుజువేంద్ర చాహల్ 52 వన్డేలు, 42 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.

Latest Updates