మంచి ఆహారం​తో క్యాన్సర్​కు చెక్​

తినే ఫుడ్‌‌‌‌కి, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు సంబంధం ఉందనేది నిజం. కొన్ని రకాల ఫుడ్‌‌‌‌ తీసుకునే వాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అలాగే ఇంకొన్ని రకాల ఫుడ్​ తీసుకునే వాళ్లు క్యాన్సర్​ బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటోంది. దీన్నిబట్టి క్యాన్సర్​ రావడానికి ఫుడ్ కూడా ఒక కారణమని సైంటిస్టులు అంటున్నారు. క్యాన్సర్‌‌ రావొద్దంటే అన్నీ సమపాళ్లలో ఉండే హెల్దీ ఫుడ్‌ తీసుకోవడం మంచిదంటున్నారు. అయితే, క్యాన్సర్​ హిస్టరీ ఉన్న కుటుంబ సభ్యులు, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా హెల్త్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ ఫేస్‌ చేసేవాళ్లు, క్యాన్సర్​ కలిగించే బ్యాడ్‌‌‌‌ హ్యాబిట్స్‌‌‌‌ లాంగ్​టైమ్ నుంచి ఉన్నవాళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు దారితీసే ఫుడ్​ విషయంలో మరింత జాగ్రత్త పడాలి. ప్రత్యేకమైన ఫుడ్‌‌‌‌కి ప్రయారిటీ ఇవ్వాలంటున్నారు బసవతారకం ఇండో–అమెరికన్​ కాన్సర్​ హాస్పిటల్ చీఫ్​ డైటీషియన్​ డాక్టర్​ వసుధా మాథూర్​.

లావు తగ్గాలె 

బాడీ మాస్ ఇండెక్స్ (మన శరీరం ఎత్తు–బరువుల నిష్పత్తి) ఎక్కువయ్యే కొద్దీ కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. ఉండాల్సిన బరువుకంటే 15 కేజీలు, అంతకంటే ఎక్కువుంటే క్యాన్సర్‌‌‌‌ రిస్క్‌‌ పది శాతం ఎక్కువ ఉంటుంది. 50 లక్షల మంది ప్రజల మీద సైంటిస్టులు స్టడీ చేసి, బాడీ వెయిట్​ పెరుగుతూ ఉంటే పేగులు, పిత్తాశయం, కిడ్నీలు, లివర్‌‌‌‌‌‌‌‌లలో క్యాన్సర్​ వచ్చే ప్రమాదం 10 శాతం ఉన్నట్లుగా తేల్చారు. శరీరంలో ఎక్కువయ్యే కొవ్వు కారణంగా హార్మోన్లు, ఇన్‌‌‌‌ఫ్లమేటరీ ప్రోటీన్స్​ఎక్కువగా తయారైతే కణుతులు ఏర్పడుతాయి. బరువు పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్​ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని క్యాన్సర్​ ఫౌండేషన్​ స్టడీస్​ చెబుతున్నాయి. బాడీ మాస్​ ఇండెక్స్​ (బీఎంఐ) సాధారణ (18.5 నుంచి 25 మధ్యలో) స్థాయిలో ఉండే వాళ్లలో క్యాన్సర్​ రిస్కు​ తక్కువగా ఉందని తేలింది.

హెల్దీ ఫ్యూచర్ ప్లాన్​

పర్యావరణాన్ని, జన్యు మార్పుల్ని మార్చలేం. కానీ ఫుడ్​ హాబిట్స్​ని మార్చుకోగలం. క్యాన్సర్స్‌‌‌‌లో 70 శాతం మనం కంట్రోల్ చేసుకునేవే. కాబట్టి హెల్దీ డైట్​ లైఫ్​ ఇంపార్టెంట్. అన్‌‌‌‌హెల్దీ ఫుడ్​ హాబిట్స్​ వల్లే 30 నుంచి 40 శాతం క్యాన్సర్​ కేసులు ఉంటున్నయ్. కాబట్టి వెయిట్ మెయింటెనెన్స్, ఫుడ్​ హాబిట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఫుడ్​ తినాలో తెలుసుకోవడం, అలవాటు చేసుకోవడం, తినకూడని వాటిని పక్కనపెట్టడం చేస్తే క్యాన్సర్ వస్తుందనే​ భయమేలేదు. ప్రపంచ క్యాన్సర్ రీసెర్చి ఫౌండేషన్ స్టడీలో ఎలాంటి ఫుడ్​ తినే అలవాట్లు ఎక్కువగా ఉన్న వాళ్లకు ఏ క్యాన్సర్​ వస్తోంది? ఏ ఫుడ్​ తినే కమ్యూనిటీల్లో క్యాన్సర్​ రేట్​ తక్కువగా ఉందో గుర్తించారు. దాని ప్రకారం ఫుడ్​ హాబిట్స్​ ఇలా ఉండాలి…

అలవాటు చేసుకోవాలె

ఫైబర్​ (పీచు) ఎక్కువగా ఉండే ఫుడ్​ తినాలి. 

రెగ్యులర్​ మెనూలో ఫైబర్​ కచ్చితంగా ఉండేలా ప్లాన్​ చేసుకోవాలి.

ఫుడ్​ క్వాలిటీ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. కానీ, బ్యాలెన్స్​డైట్​ మీద శ్రద్ద తగ్గుతోంది. రెంటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.

మీల్స్‌‌‌‌లో మూడు వంతుల ఫుడ్​ మొక్కల నుంచి వచ్చినది (అన్నం, కూరలు, పప్పులు, చపాతీ, జావ లాంటివి), ఒక వంతు మాంసం, యానిమల్​ ఫ్యాట్, ప్రొటీన్​రిచ్ ఫుడ్​ఉండేలా చూసుకోవాలి.

ప్రాసెస్​ చేయని (పైపొరలు పూర్తిగా తీసేయని) మిల్లెట్స్, ముడి బియ్యం (బ్రౌన్ రైస్-దంపుడు బియ్యం), కూరగాయలు, పండ్లు రెగ్యులర్​ గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్​ సోకే రిస్కు తక్కువ అవుతుంది.

తక్కువ తక్కువగా తినాలి. ఒక రోజులో వీలుని బట్టి 5 నుంచి 9 సార్లు ఫుడ్​ తీసుకోవాలి.

రోజూ పండ్లు. సీజనల్ గా వచ్చే పండ్లు ​తింటే మంచిది. 

బీఫ్, పోర్క్​కి బదులుగా చేపలు, కోళ్లు, బాతులు, గుడ్లు తినాలి.

ప్రతి భోజనంలో మిల్లెట్స్ (కొర్రలు, అండుకొర్రలు, సామెలు, ఊదలు, అరికెలు)తోపాటు, బీన్స్, బఠాణీలు ఉండేలా చూసుకోవాలి. 

గ్రీన్, ఆరెంజ్​ కలర్స్​ కూరగాయలు ఎక్కువగా తినాలి.

మానుకోవాలె

కొవ్వు ఎక్కువగా ఉన్న ఫుడ్​ తీసుకోవడం తగ్గించాలి.

రెడ్​ మీట్‌‌‌‌ని రెగ్యులర్​గా తీసుకోవద్దు.

వీలయినంత వరకు యానిమల్​ఫ్యాట్ తగ్గించాలి. వెజిటబుల్ ఫ్యాట్‌‌‌‌తో ప్రమాదం లేదు.

కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్​మానేయాలి.

పాలిష్​చేసిన బియ్యంతో వండిన అన్నం తినొద్దు.

మాడిన, నిప్పులు, మంటపై కాల్చిన, పొగ చూరిన ఫుడ్​ తినకూడదు.

ఆల్కహాల్ వల్ల నోరు, పేగు, బ్రెస్ట్, స్వరపేటిక, కాలేయ క్యాన్సర్లు వస్తాయి.

ఆల్కహాల్ తీసుకునేవాళ్లు స్మోకింగ్​ చేస్తే క్యాన్సర్​ రిస్కు​ ఇంకా ఎక్కువగా ఉంటుంది.

Latest Updates