నిజాలు తెలుసుకుని మాట్లాడాలి

ఒక నిఖార్సైన భారత మాత బిడ్డ అయిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ కోసం రాజకీయాల్లోకి వచ్చామ‌న్నారు ఎంపీ అర్వింద్. విలువలు, నిజాయితీలే మా ఆస్తులని..వాటిని పెంపొందించడానికి వచ్చామ‌న్నారు. ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అన్న విషయంలో పూర్తి పారదర్శకతతో ఉంటామ‌ని తెలిపారు. ఇది తెలుసుకోకుండా కేసీఆర్ తో కలిసి దేశాన్ని దోచుకున్న దొంగ సొమ్ముతో కొన్ని మీడియాని అడ్డుపెట్టుకొని నా మీద బురద జల్లినోళ్లకు, నిజానిజాలు తెలుసుకోకుండా దానికి వంతపాడిన కొంతమంది కాంగ్రెస్ లీడర్లకు కనువిప్పు కలగాలన్నారు.

మైనింగ్ అక్రమాలను బయటపెట్టినందుకు, నా గురించి కావాలని తప్పు వివరాలు సమర్పించి, నేను చదివిన యూనివర్సిటీలో అసలు నేను చదవలేదంటూ మై హోమ్ గ్రూప్ కి చెందిన ఒక టీవీ ఛానెల్ పదే పదే రకరకాల కథనాలు ప్రసారం చేసిందన్నారు. అవి నన్ను బాధించినా, నిజం నిలకడ మీద తెలుస్తదన్న నమ్మకంతో ఉన్నానన్నారు. ఈ రోజు, అదే యూనివర్సిటీలో నేను పీజీ పూర్తి చేసానని, జనార్ధన్ రాయి నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ డైరెక్టర్ అఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్వయంగా ఇచ్చిన లేఖను మీ ముందు పెడుతున్నాను అన్నారు.

ఇంతకాలం ఈ విషయమై ఆ మీడియా సంస్థ నిరవధికంగా చేసిన మీడియా-విచారణల్లో వాది, ప్రతి వాది, సాక్ష్యం, జడ్జి, తీర్పు, సమస్తం ఆ ఛానెల్ వారే మారి, మైనింగ్ అక్రమాల టాపిక్ ని పక్కదోవ పట్టించడానికి తీవ్ర కృషి చేశారన్నారు. ఆ ఛానల్ వారు బేషరతుగా క్షమాపణ చెబితే, ఆ యాజమాన్యానికే మంచిదన్నారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Latest Updates