వాళ్లని చంపాలని మేమెప్పుడూ అనుకోలేదు

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. బాధితురాలికి సరైన న్యాయం మహిళలు, విద్యార్ధినులు అంటున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాకుండా దేశమంతా మహిళలు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో కూడా ఇలా జరిగి ఉంటే బాగుండేది అంటూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. నిర్భయ తల్లి కూడా దిశ తల్లిదండ్రులకు 7 రోజుల్లో న్యాయం జరిగిందని సంతోష పడ్డారు. తన కూతురి విషయంలో కూడా నిందితులను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై అప్పటి డిల్లీ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ..  నిర్భయ నిందితులను చంపాలని తామెప్పుడూ అనుకోలేదన్నారు. నిందితులను చంపేయమని, ఆకలితో ఉన్న సింహాల ముందు వేయాలని ప్రజలంతా నినాదాలు చేశారన్నారు. ఆ సమయంలో చాలా ఒత్తిడి ఉందని.. అయినా తాము చట్టాన్ని గౌరవించి నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టామన్నారు.

Latest Updates