సుప్రీం తీర్పుపై నో రివ్యూ పిటిషన్ : సున్నీ వక్ఫ్ బోర్డు

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని తెలిపింది సున్నీ వక్ఫ్‌ బోర్డు. కీలకమైన తీర్పు వెలువడిన తర్వాత రివ్యూ పిటిషన్‌ వేయాలని భావించినా.. తీర్పు సమీక్షించిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు చెప్పింది.

దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest Updates