యాక్టర్లు కేవలం ఎంటర్ టైనర్లే.. హీరోలు కాదు..సైనికులే మన హీరోలు

సాధారణంగా మీకు నచ్చిన హీరో ఎవరంటే ఏం చెబుతారు…? ఎవరికి నచ్చినట్లు వాళ్ల వాళ్ల హీరోల పేర్లు చెబుతుంటారు. కానీ ఇప్పటి నుంచి ఆర్మీ, పోలీసులే మన హీరోలని చెప్పుకోవాలి.

భారత్ – చైనాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందారు. వారి మరణంపై సినీ యాక్టర్, మాజీ ఎంపీ పరేష్ రావల్ స్పందించారు.

ఇకపై ప్రతీ ఒక్కరు వారి పిల్లలకు  మీ హీరో ఎవరంటే యాక్టర్ల పేర్లు కాకుండా..మా హీరో ఆర్మీ పోలీసులని చెప్పేలా అలావాటు చేయాలని కోరారు. యాక్టర్లు ఎంటర్ టైన్ చేస్తే..సైనికులు మన కోసం ప్రాణాలర్పిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం పరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి

Latest Updates