మజీద్, మందిర్ ను కూల్చడాన్ని బ్లాక్ డే గా భావిస్తున్నాం

సెక్రటేరియట్ లోని మజీద్, మందిరాన్ని కూల్చడాన్ని బ్లాక్ డే గా భావిస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ప్రణాళికలో భాగంగామే మజీద్ ను కూల్చటాన్ని  అసదుద్దీన్ స్వాగతించారని ఆరోపించారు. సొంత దుకాణాలను నడుపుకోవటానికి మతం పేరుతో వేల మంది ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర ఎంఐఎం, బీజేపీలదన్నారు. వైఎస్ఆర్ తో మాట్లాడి సచివాలయంలో మజీద్ ను  తానే నిర్మించినట్లు తెలిపారు. అయినా అసలు సెక్రటేరియట్ కే రాని సీఎం కేసీఆర్ కు కొత్త సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. తన వారసుడు కేటీఆర్ ను సీఎం ను చేయడం కోసమే మూఢ నమ్మకంతో..కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారన్న షబ్బీర్ అలీ….మజీద్, మందిర్లను కూల్చుతున్న సీఎస్, డీజీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Latest Updates