మాకు ఉద్యోగాలు కావాలె


హైదరాబాద్ యూత్ డిమాండ్

ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నామని ఆవేదన

సమస్యలపై కేటీఆర్ కు ట్వీట్లు చేస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఉద్యోగాలు లేక సఫర్​ అవుతున్నామని, ఇప్పటికైనా కొలువు ఇవ్వాలని యువత డిమాండ్​ చేస్తున్నది. దాంతో పాటు ట్రాఫిక్​తో మస్తు సమస్య అవుతున్నదని, పొల్యూషన్​తో ఊపిరి తీసుకోలేకపోతున్నమని చెబుతున్నారు. రోడ్లు సక్కగా లేవని, కొన్ని చోట్లనే డెవలప్​మెంట్​ జరుగుతున్నదని, అన్ని ఏరియాలనూ అభివృద్ధి చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ గుంతలు, అడ్డదిడ్డంగా యూటర్న్​లు, ఏడున్నయో తెల్వని మ్యాన్​హోల్స్​ వంటి సమస్యలతో సతమతమవుతున్నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్​ను కంట్రోల్​ చేసి, రోడ్లు మంచిగా వేయాలని, సైక్లింగ్​, వాకింగ్​ ట్రాక్​లు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. పార్క్​లలో ఆటలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యలపై యూత్​ను ఆరా తీస్తే 90%  మంది ఇవే చెప్తున్నారు.

చదివింది ఎంటెక్​.. చేసేది ఫుడ్​ డెలివరీ

చాలామంది బీటెక్​లు, ఎంటెక్​లు చేసి జాబ్స్​ కోసం వెయిట్​ చేశారు. అయితే, నోటిఫికేషన్​లు లేకపోవడంతో చదువుకు సంబంధం లేని ఉద్యోగాలు చేస్తున్నారు. ఫుడ్​డెలివరీ బాయ్స్​గా, ఓలా, ఊబెర్​ వంటి సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. చేస్తున్నరు. మరికొందరు హోటళ్లు, కేఫెలలో పనిచేస్తున్నరు. రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగైతయనుకుంటే మరింత దిగజారుతున్నాయని యువత ఆవేదన చెందుతున్నారు. ఇంటింటికీ ఉద్యోగాలిస్తామని చెప్పినా.. అది ఇంత వరకు నెరవేరలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి ఖాళీగా ఉంటున్నామంటున్నారు. ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి ఉద్యోగాలివ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎడ్యుకేషన్​, హెల్త్​, ట్రాన్స్​పోర్ట్​ వంటి చాలా డిపార్ట్​మెంట్లలో ఖాళీలున్నా భర్తీ చేయట్లేదని వాపోతున్నారు.

ఒక్క రోడ్డూ సక్కగ లేదు

సిటీ రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తున్నదని, రోడ్లన్ని గుంతలమయమని ఆరోపిస్తున్నారు. విపరీతమైన ట్రాఫిక్​తో పాటు పొల్యూషన్​ ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల నిర్మాణం వల్ల యూటర్న్​ల కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోందని,  దాని వల్ల చాలా టైం వేస్ట్​ అవుతున్నదని చెబుతున్నారు. వర్షం వచ్చి ట్రాఫిక్​లో ఇరుక్కుంటే గంటలకుగంటలు అక్కడే ఉండాల్సి వస్తున్నదని, రాత్రి పూట వెళ్లేటప్పుడు రోడ్లపై ఎక్కడ గుంతలు, మ్యాన్​హోల్స్​ ఉన్నాయో కూడా తెలుస్తలేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

కబ్జాలు  కాదు.. పబ్లిక్​ సర్వీస్​ కావాలె

రాజకీయ నాయకులు స్థలాలు కబ్జా చేయడంలోనే ముందుంటున్నారని, పబ్లిక్​ సర్వీస్​కు మాత్రం ముందుకు రావట్లేదని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సర్కారు ఇచ్చే నిధులు గ్రౌండ్​ లెవెల్​లో అందట్లేదని, మధ్యలోనే చేతులు మారుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఓట్లప్పుడు కాకుండా మామూలు టైంలో జనాల కష్టాలను తెలుసుకోవాలంటున్నారు.

పేదలను పట్టించుకోవాలే..

లాక్​డౌన్​, వరదల టైంలో ప్రజలు ఎంతో బాధపడ్డారని, చాలామందికి సాయమన్నదే అందలేదని అంటున్నారు. పదివేల వరద సాయం కూడా బాధితులకు అందలేదన్నారు. సమస్యలు వచ్చినప్పుడు నాయకులు అందుబాటులో ఉండట్లేదని చెబుతున్నారు. చదువు, వైద్యం పేదలకు ఇంకా ఆమడ దూరంలోనే ఉన్నాయని, ప్రభుత్వ దవాఖాన్లలో సౌకర్యాలు సరిగా ఉండటంలేదని చెబుతున్నరు.

పచ్చదనం పెంచాలి

పొల్యుషన్​ దారుణంగా ఉంది. దాన్ని తగ్గించేందుకు పచ్చదనం పెంచాలి. హరితహారం అంటున్నరు కానీ సిటీమొత్తం అది కనిపించట్లేదు. జిల్లాల్లో మొక్కలు ఎక్కువగా నాటుతున్నారు. సిటీలో కూడా ఇంకా కొంచెం ఎక్కువ కమిట్​మెంట్​తో చేయాలి. మా ఏరియా పార్క్ లో పిచ్చిమొక్కలు మాత్రమే ఉన్నాయి. స్పోర్ట్స్​ యాక్టిటివీస్​ పెంచితే బాగుంటుంది. అలాగే వాకింగ్​, సైక్లింగ్​ ట్రాక్​లు ఏర్పాటుచేయాలి. ఫుట్ పాత్స్ అసలు సరిగాలేవు. ఉన్నచోట్ల పాన్ షాపులు, బండ్లు కనిపిస్తున్నయ్​. – శ్రీకాంత్​, స్టూడెంట్​, ఓయూ కాలనీ

మిల్క్​షేక్స్​ పార్లర్​లో పనిచేస్తున్న

బతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ సంతృప్తి లేదు. నేను చదివింది బీటెక్​, కానీ మిల్క్​ షేక్స్​ పార్లర్​ లో పని చేస్తున్న. చదువుకుని తగిన ఉద్యోగం చేయాలని ఉన్నా కుటుంబ పరిస్థితుల వల్ల కుదరడంలేదు. గవర్నమెంట్​ మాలాంటి స్టూడెంట్స్​ విషయంలో దృష్టి పెట్టి ఉద్యోగాలిస్తే బాగుంటది.  – మల్లేశ్​, షేక్​పేట

కింది స్థాయికి అందట్లేదు

నేను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. సిటీ చాలా మారింది కానీ.. ఒకసైడ్​ మాత్రమే డెవలప్​మెంట్​ ఉంది. అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలి. కింది స్థాయిలో ఉన్న జనానికీ ఏవీ అందట్లేదు. మొన్న వరద సాయం కూడా అందలేదు. నేను కేటీఆర్​ను ట్విట్టర్​లో ఫాలో అవుతున్నా. సమస్య ఇది అని చెప్తే.. తీరుస్తం అని బదులిస్తున్నరు. రియాక్ట్​ అవ్వడం కాదు.. సమస్యలను సాల్వ్​ చేస్తే బాగుంటది. – సందీప్​, ఓయూ కాలనీ

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

Latest Updates