మానవ హక్కుల కమిషన్‌కు సమాధానం చెబుతాం: సజ్జనార్

దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు వస్తే సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీపీ సజ్జనార్. ఈ ఘటన జరిగిన తీరుపై NHRC, ప్రభుత్వం సహా సంబంధిత అన్ని విభాగాలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. శుక్రవారం ఉదయం షాద్ నగర్ అండర్ పాస్ దగ్గర దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఆ స్పాట్‌లోనే ఆయన మీడియాకు వివరించారు.

దిశ వస్తువులు చూపిస్తామంటూ..

దిశను రేప్ చేసి, దహనం చేసిన ఘటనపై ఎటువంటి క్లూ లేకుండా స్టార్ట్ అయిన తమ దర్యాప్తులో తర్వాత పక్కా సైంటిఫిక్ ఆధారాలు సేకరించామని చెప్పారు సజ్జనార్. నిందితులను తమ కస్టడీకి తీసుకున్నాక విచారించే క్రమంలో మరిన్ని సాక్ష్యాల కోసం శుక్రవారం తెల్లవారు జామున సంఘటన స్థలానికి వాళ్లను తీసువచ్చినట్లు చెప్పారు. దిశ ఫోన్, ఇతర వస్తువులను దాచిపెట్టిన చోటు చూపిస్తామంటూ.. అక్కడ ఉన్నాయ్.. ఇక్కడ ఉన్నాయ్ అని ఏమార్చి, పోలీసులపై దాడికి దిగారని తెలిపారు. కర్రలు, రాళ్లు తీసుకుని శివ, నవీన్ పోలీసులను కొడుతుంటే, వారి దగ్గర నుంచి చెన్నకేశవులు, మహ్మద్ తుపాకీలను లాక్కున్నారని వివరించారు.

More News:

ఈ ఎన్‌కౌంటర్ ను వ్యతిరేకించినోళ్లు దేశద్రోహులు

నేను ఈ తరహా ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం : ఒవైసీ

ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు లక్ష చొప్పున నజరానా

హైదరాబాద్ పోలీసుల స్టోరీ వింటుంటే ఫన్నీగా ఉంది: సుశీల్ మోడీ

లొంగిపోవాలని కోరినా..

తుపాకులు లాక్కుని నిందితులు పోలీసులపై కాల్పులకు దిగారని సీపీ సజ్జనార్ వివరించారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించి, వారిని లొంగిపోవాలని కోరారన్నారు. కానీ వాళ్లు ఆపకుండా కాల్పులు జరపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కాల్పుల్లో నిందితులు నలుగురూ మరణించారని సీపీ తెలిపారు. నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయని, అయితే ఎవరికీ బుల్లెట్ గాయలు లేవని చెప్పారు.

NHRC విచారణపై..

ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా తీసుకుని విచారిచబోతోంది కదా అని మీడియా ప్రతినిధులు అడగగా, చట్టం తన పని తాను చేసిందని సీసీ సమాధానమిచ్చారు. NHRC సహా అన్ని కన్సర్న్ విభాగాలకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధమని తెలిపారు.

రేప్ చేసి తగలబెట్టిన ఘటనలపై..

ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గతంలో రేప్ చేసి, తగలబెట్టిన ఘటనల్లో వీళ్ల ప్రమేయంపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు సజ్జనార్. ఆ కేసులపై డేటా సేకరించి, లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని అన్నారు. అయితే ఈ సెన్సేషనల్ కేసులో బాధితురాలు, నిందితుల కుటుంబాలను ఇంటర్వ్యూల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని కోరారు సీపీ.

Latest Updates