రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా పెంచుతాం: కేటీఆర్

రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు  తీసుకురానున్నట్లు మంత్రి  కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాల పెంపు పై పలు శాఖల అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో  ఇవాళ (బుధవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా పెంచుతామన్నారు. ఇందుకోసం వివిధ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణల పైన కేటీఆర్ వారితో చర్చించారు. దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాల్సిన సంస్కరణలు, నిర్ణీత గడువులోగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. న్యాయ, టూరిజం, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ,సివిల్ సప్లై, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సిసిఎల్ఎ వంటి పలు శాఖల పైన మంత్రి కేటీఆర్ ఆయా సెక్రటరీలకు వివరాలు అందజేసి, చేపట్టాల్సిన సంస్కరణలపై పలు సలహాలను, సూచనలను చేశారు. కొన్ని సంస్కరణలను ఒక నెలలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా వేగంగా పని చేయాలని కేటీఆర్ శాఖ అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చేపడుతున్న సంస్కరణలతో ప్రజలకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. దీంతోపాటు ప్రజలకు ఏ సేవ అయినా ఒకే చోట అందించే విధంగా సిటిజన్ సర్వీస్ మేనేజ్మెంట్ పోర్టల్ చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో చర్చించారు. ఏ సేవ అయినా నేరుగా ఆన్ లైన్ ద్వారా అందుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయా శాఖలు చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తే వాటిని పర్యవేక్షణ చేసేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్.

TSB పాస్ పైన చర్చ…

టీఎస్ బిపాస్  దేశంలో ఎక్కడా లేని విధంగా పౌరులకి అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా, పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులను, లేఅవుట్లు అనుమతులు ఇస్తోందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే చట్టంగా రూపొందినదని, తర్వాత దాని అమలుకు సంబంధించిన కార్యక్రమాల పైన ఈ సందర్భంగా వివిధ శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. టీఎస్ బిపాస్ అనేది చారిత్రాత్మక చట్టమని దీని అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమని ఆ దిశగా ఇప్పటినుంచి ఆయా శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. టీఎస్ బిపాస్ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. త్వరలోనే శాఖలన్నీ సమన్వయంతో సహకారంతో క్షేత్రస్థాయిలో టీఎస్ బి పాస్ అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కేటీఆర్.

Latest Updates