IPL: ఫైనల్‌కి వెళ్లి తీరుతాం: ధోని

  • ఫైనల్‌కు వెళ్ళడానికి మరో అవకాశం

తాము ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటామన్నారు చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని. చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చెన్నై పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే తమ జట్టులో కూడా మంచి బ్యాట్స్‌మెన్ ఉన్నారని.. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నా మెరుగైన ఆటతీరు ప్రదర్శించలేక పోయామన్నారు ధోని. ఫైనల్‌ చేరడానికి చెన్నైకి మరో అవకాశం ఉండటంతో…తర్వాతి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని భావిస్తున్నానని ధోని ధీమా వ్యక్తం చేశారు.

Latest Updates