వ్యవసాయ బిల్లులతో రైతులకు మోడీ పట్టం కట్టారు

వ్యవసాయ బిల్లులతో రైతులకు మోడీ పట్టం కట్టారన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. ఈ బిల్లులతో ప్రతిపక్షాల చాప్టర్ క్లోజ్  అవుతుందన్నారు. వ్యవసాయ బిల్లులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సభలు నిర్వహిస్తామని చెప్పారు. కొత్త వ్యవసాయ బిల్లులతో పంటను రైతు అంతర్జాతీయంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు అర్వింద్. రైతులకు లోడింగ్ అన్ లోడింగ్ చార్జీలు మిగులుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల నుంచి టాక్స్ వసూలు చేసే హక్కు లేదన్నారు. మార్కెట్ యార్డు ఫీజు పోయిందనే టీఆర్ఎస్ గగ్గోలు పెడుతుందని విమర్శించారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి…కేసీఆర్ సొంత ఖజానాను నింపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అర్వింద్.

Latest Updates