ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

GHMC ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.  హైదరాబాద్ తాజ్ బంజారాలో జరిగిన ఇంటలెక్చువల్ మీటింగ్ లో జేపీ నడ్డా పాల్గొన్నారు.  సీఎం కేసీఆర్ హామీలను మర్చిపోయారనీ… తాము మాత్రం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరతామన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీయే విజయం సాధిస్తుందన్నారు నడ్డా.  దుబ్బాకలో కూడా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగిందనీ… రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.

 

Latest Updates