మేము ప్రతిపక్షంలోనే ఉంటాం: శరద్ పవార్

మహారాష్ట్రలో తాము  ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ . ప్రజలు తమకు తీర్పిచ్చింది ..ప్రతిపక్షంలో కూర్చోడానికే కానీ అధికారం చేపట్టడానికి కాదన్నారు. రాష్ట్రంలో తాము ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. మరో వైపు శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలా కాంగ్రెస్,ఎన్సీపీ నేతలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు బీజేపీ(105) శివసేన(56) కూటమికి 161, కాంగ్రెస్(44), ఎన్సీపీ(54) కూటమికి 98, ఇతరులు 29 సీట్లు వచ్చాయి.

Latest Updates